చారిటీ షో: నితిన్, నాగ చైతన్య, మనోజ్, హన్సిక సందడి (ఫోటోస్)
హైదరాబాద్: హుదూద్ తుఫాన్ బాధితుల కోసం నిధుల సేకరణలో భాగంగా ఇటీవల హార్డ్ రాక్ కేఫ్ లో చారిటీ మ్యూజికల్ షో నిర్వహించారు. ప్రముఖ స్టైలిష్ డిజైనర్ నీరజ కోన ఆర్గనైజ్ చేసిన ఈ మ్యూజికల్ షోలో యువ సంగీత దర్శకుడు ఎస్ ఎస్ తమన్ ఆధ్వర్యంలో మ్యూజికల్ నైట్ నిర్వహించారు.
ఈ చారిటీ కార్యక్రమంలో టాలీవుడ్ యంగ్ హీరోలు నితిన్, నాగ చైతన్య, మనోజ్, హీరోయిన్లు హన్సిక, రాకుల్ ప్రీత్ సింగ్, మంచు లక్ష్మి తదితరులు పాల్గొని సందడి చేసారు. పాటలు పాడారు. డాన్స్ చేసారు. వీరితో పాటు పలువురు గాయనీగాయకులు లైవ్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన డబ్బును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేసారు.
మ్యూజిక్ షోకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో...

సెలబ్రిటీ సందడి
చారిటీ షోలో తెలుగు సినిమా సెలబ్రిటీలు ఇలా సందడి చేసారు.

మంచు లక్ష్మి డాన్స్
ఈ చారిటీ షో సందర్భంగా ప్రముఖ నటి మంచు లక్ష్మి సందడి చేసింది.

నితిన్, లక్ష్మి, నాగ చైతన్య
చారిటీ షోలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా నితిన్, లక్ష్మి, నాగ చైతన్య ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

ఒక మంచి పని కోసం..
ఒక మంచి పని కోసం జరుగుతున్న కార్యక్రమం కావడంతో సెల్రబిటీలంతా తమ పనులన్నీ పక్కన పెట్టి ఈ షో కోసం సమయం కేటాయించారు.

ఉత్సాహంగా...
చారిటీ మ్యూజిక్ షోలో ఉత్సాహంగా ప్రదర్శించిన నితిన్, రాకుల్ ప్రీత్ సింగ్, మంచు లక్ష్మి.

పాట పాడిన మనోజ్
ఈ మధ్య తన సినిమాల్లో సొంతగా పాటలు పాడుతున్న మనోజ్...ఈ చారిటీ షోలో కూడా పాట పాడారు.

మంచు లక్ష్మి
చారిటీ కార్యక్రమానికి హాజరైన మంచు లక్ష్మి వస్త్రధారణ ఆకట్టుకుంది.

పాట పాడిన నాగ చైతన్య
నాగ చైతన్య కూడా ఈ కార్యక్రమంలో తన సింగింగ్ టాలెంట్ ప్రదర్శించారు.

హన్సిక, నీరజ
కోన నీరజ, హన్సిక ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

హన్సిక, నీరజ, రాకుల్
హన్సిక, కోన నీరజ, రాకుల్ ప్రీత్ సింగ్ ఇలా ఫోటోలకు.....

నితిన్, నీరజ, చైతూ
నితిన్, నాగ చైతన్యలతో కలిసి కోన నీరజ...

రాకుల్ ప్రీత్ సింగ్
రాకుల్ ప్రీత్ సింగ్ వస్త్రధారణ హాట్‌గా ఉందని అభిమానులు ప్రశంసించారు.

తమన్
ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ ఆధ్వర్యంలో ఈ మ్యూజిక్ నైట్ జరిగింది.


Click it and Unblock the Notifications











