ఎలాగూ బయిటకి వచ్చేంది కదా అని ట్వీటాడు

By Srikanya

Thaman on Shruti's special in Aagadu
హైదరాబాద్ : ఇంతకుముందు సినిమా న్యూస్ తెలియాలంటే న్యూస్ పేపరో లేదా సిని మ్యాగజైన్స్ పై ఆధారపడేవారు. ఇప్పుడు పరిస్ధితులు మారాయి. అన్ని న్యూస్ లు సినిమావాళ్లు రివిల్ చేయకముందే బయిటకు వచ్చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఆ టెక్నీషియన్స్ ట్విట్టర్స్ ద్వారా వాటిని ఖరారు చేస్తూ పనిలో పనిగా తమ సినిమాలకు పబ్లిసిటీ చేసుకుని క్రేజ్ తెచ్చుకుంటున్నారు. తాజాగా సంగీత దర్శకుడు తమన్ ఇదే పనిలో ఉన్నాడు.

ఆగడు చిత్రంలో శృతిహాసన్...ఐటం సాంగ్ చేస్తున్న విషయం నిన్నే బయిటకు వచ్చేసింది. అప్పటికీ తమన్...త్వరలో ఓ సర్పైజింగ్ న్యూస్ చెప్తానని ఊరించాడు. అదే అని అందరికీ తెలిసిపోయింది. ఇక ఎలాగూ తెలిసిపోయింది కదా అనో మరేమో కానీ...తమ ఆగడు చిత్రంలో శృతి ఐటం గర్ల్ గా కనిపించి రాక్ చేయబోతందని ట్వీటాడు.

ఇక కృష్ణ పుట్టినరోజు సందర్భంగా 'ఆగడు' టీజర్‌ని విడుదల చేశారు. ఇందులో మహేష్‌ పలికిన సంభాషణలు అభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపాయి. మహేష్‌బాబు, శ్రీనువైట్ల కలయికలో రూపుదిద్దుకొంటున్న చిత్రం 'ఆగడు'. తమన్నా కథానాయిక.

పంచ్‌ డైలాగు లేకపోతే.. టీజర్‌, ట్రైలర్‌ పూర్తవడం లేదు. ఆఖరి పంచ్‌ హీరోదైతే ఆ కిక్కే వేరుగా ఉంటుందని సినీ జనాలకు అర్థమయ్యింది. అందుకే పంచ్‌లు పేలుతున్నాయి. అయితే మహేష్‌బాబు మాత్రం 'ఆగడు' టీజర్‌లో పంచ్‌లపైనే పంచ్‌ వేసేశాడు.
''సినిమాల ప్రభావం జనాలమీద ఎంతుందో తెలియదుగానీ, పంచ్‌ డైలాగుల ప్రభావం గట్టిగా ఉంది..'' అంటూ పంచ్‌లపై ఓ పంచ్‌ వేశారు. ''ప్రతివోడూ పులులు, సింహాలు, ఏనుగులు, ఎలుకలంటూ ఎదవ కంపేరిజన్‌లు, ఒళ్లు వులపరం వచ్చేస్తోంది..'' అంటూ ఇంకోటి. మొత్తానికి టీజర్‌ మొత్తం హుషారుగా సాగిపోయింది.

ఈ చిత్రంలో మహేష్ తొలిసారిగా రాయలసీమ యాస మాట్లాడుతూ తుపాకీ ఎక్కుపెట్టబోతున్నారు. 'ఆగడు'లో ఆయన ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌గా నటిస్తున్నట్టు సమాచారం. మహేష్‌, తమన్నా జంటగా నటిస్తున్న చిత్రమిది. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు.

'దూకుడు' తర్వాత మహేష్‌, శ్రీను వైట్ల కలయికలో రూపొందుతున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాల్ని అందుకొనేలా 'ఆగడు'ని రూపొందిస్తున్నట్టు సినిమావర్గాలు చెబుతున్నాయి. మహేష్‌ శైలి వినోదం, యాక్షన్‌ అంశాల మేళవింపుతో సాగే ఈ చిత్రం ఇంటిల్లిపాదినీ అలరించేలా ఉంటుందని నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రానికి తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. దసరా కానుకగా సెప్టెంబర్ 26న సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇంతకాలం శ్రీను వైట్లతో కలిసి పని చేసిన గోపీ మోహన్, కోన వెంకట్ సొంతగా దర్శకత్వం వైపు అడుగులు వేయడంతో.... 'ఆగడు' సినిమాకు సొంతగా స్క్రిప్టు రాసుకుని దిగారు శ్రీను వైట్ల. 14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్స్ బేనర్లో 'దూకుడు' సినిమా చేసిన మహేష్ బాబు.....అదే బానర్లో సుకుమార్ దర్శకత్వంలో సినిమాకు చేసారు. ఆ సినిమా వెంటనే మళ్లీ ఇదే బేనర్లో శ్రీను వైట్లతో 'ఆగడు' సినిమా చేయడానికి రెడీ కావడం గమనార్హం. ఖచ్చితంగా మరో హిట్ తో వస్తామని శ్రీను వైట్ల,నిర్మాతలు పూర్తి నమ్మకంగా ఉన్నారు. సంగీతం: తమన్‌, ఛాయాగ్రహణం: కె.వి. గుహన్‌, కళ: ఎ.ఎస్‌.ప్రకాశ్‌, కూర్పు: ఎం.ఆర్‌.వర్మ, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: పరుచూరి కోటి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X