థమన్ ఔట్ : ప్రభాస్ రెబల్‌కు లారెన్సే వాయిస్తాడట!
ప్రభాస్, తమన్నా, దీక్షా సేథ్ జంటగా రాఘవ లారెన్స్ దర్శకత్వంలో 'రెబల్ ' మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యారు కూడా. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రం నుండి థమన్ తప్పుకున్నారు. దర్శకుడు రాఘవ లారెన్సే ఈ చిత్ర సంగీతాన్ని కూడా హ్యాండిల్ చేస్తాడట.
ఈ విషయమై థమన్ ట్విట్టర్లో ద్వారా స్పందిస్తూ...''సంగీత దర్శకత్వం వహిస్తున్న రాఘవ లారెన్స్ గారికి శుభాకాంక్షలు. రెబల్ టీం మొత్తానికి మంచి జరుగాలని ఆశిస్తున్నా. తెలుగు తమిళంలో భారీ విజయం సాధించిన 'కాంచన' చిత్రానికి సంగీతం అందించే అవకాశం ఇచ్చిన లారెన్స్ మాస్టర్‌కి థాంక్స్. నేను అఫీషియల్‌గా రెబల్ సినిమా నుంచి తప్పుకుంటున్నా'' అంటూ ట్వీట్ చేశారు.
రెబల్ చిత్రాన్ని జె. భగవాన్, జె.పుల్లారావు బాలాజీ సినీ మీడియా బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. దీంతో పాటు కొరటాల శివ దర్శకత్వంలో వారధి చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానన్ని ప్రమోద్ ఉప్పలపాటి మరియు వంశి కృష్ణ శ్రీనివాస్ సంయుక్తం గా యు.వి.క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. అనుష్క, రీచా గంగోపాధ్యాయ్ హీరోయిన్లు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పలు విజయవంతమైన చిత్రాలకు డైలాగ్ రైటర్ గా పని చేసిన కొరటాల శివ చిత్రం ద్వారా తన టాలెంట్ ఏమిటో చూపించడానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











