తమన్ మ్యూజికల్ షో...పూర్తి డిటేల్స

By Srikanya

హైదరాబాద్: ప్రముఖ సంగీత దర్శకుడు తమన్‌ ఈ నెల 19న హైదరాబాద్‌లో ఓ మ్యూజికల్‌ షో నిర్వహించి ఆ ఆదాయాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేయనున్నారు. హైదరాబాద్ హార్డ్ రాక్ కేఫ్ లో ఈ మ్యూజికల్ షో జరగనంది. ఈ షోకు గెస్ట్ లుగా నాగచైతన్య, హన్సిక వచ్చే అవకాసం ఉందని తెలుస్తోంది. పలు చిత్రాలకు కాస్ట్యూమ్స్ డిజైనర్ గా పనిచేసిన నీరజ్ కోన ఈ షో ని ఆర్గనైజ్ చేయనున్నారు.

తమన్ ప్రేరణతో మిగతా సంగీత దర్శకులు కూడా తమదైన ప్లాన్ లతో ముందుకు వెళ్ళటానికి సన్నాహాలు చేస్తున్నటాలు సమాచరం. హుద్‌ హుద్‌ చేదు జ్ఞాపకాల్ని మిగిల్చి వెళ్లిపోయింది. కళకళలాడే ఉత్తరాంధ్రని కష్టాల్లో ముంచి పోయింది. ఆ కష్టాల్ని పూర్తిగా తీర్చలేకపోయినా ఈ విధంగా అయినా తమ రుణం తీర్చుకుంటున్నారు సినిమా వారు.

ప్రకృతి కోపాన్ని ఆపలేకపోయినా, బాధితుల శోకాన్ని తగ్గించే శక్తి మనకుంది. వాళ్ల బాధని పంచుకొనే స్థోమత మనకుంది. అందుకే ఆదుకొనే మనసులు ముందుకొస్తున్నాయి. నష్టాన్ని పూడ్చేందుకు చేయీ చేయీ కలుపుతున్నాయి. మంగళవారం నుంచి తారాలోకం భారీగా విరాళాలు ప్రకటిస్తోంది. బుధవారం కూడా తారలు తమ ఉదారతను చాటుకొన్నారు. ఒకొక్కరూ తమ వంతు సాయాన్ని అందించారు.

 Thaman to perform at a concert

కొంతమంది నిత్యావసర వస్తువులు, వైద్యసహాయం అందించడానికి పూనుకొంటున్నారు. చిన్నా, పెద్దా లేదు. స్టార్‌ హీరో, కొత్త కథానాయకుడు అనే తారతమ్యం లేదు. ఇన్నాళ్లూ ఆదరించిన ప్రేక్షకుల రుణం తీర్చుకొనే తరుణం ఇదేనంటూ తమ వంతుగా విరాళాలు అందించారు

స్టార్స్ కాకుండా.... బ్రహ్మానందం: 3 లక్షలు, స్మిత: 2 లక్షలు, ఎన్జీవోల ద్వారా మరో 3 లక్షల సహాయం, సందీప్‌ కిషన్‌ : 2.5 లక్షలు, ఆకాష్‌ పూరి: 2 లక్షలు, చిన్నికృష్ణ కుటుంబం: 1.5 లక్షలు, రకుల్‌ప్రీత్‌సింగ్‌: లక్ష, నందు: లక్ష, రాశీఖన్నా: లక్ష, నవీన్‌చంద్ర: లక్ష, సాయి కొర్రపాటి: 100 టన్నుల బియ్యం, నిఖిల్‌: లక్ష, మరో లక్ష విలువగల నిత్యావసర వస్తువులు, రావు రమేష్‌: లక్ష, గోపీచంద్‌ మలినేని: లక్ష, రాహుల్‌ రవీంద్రన్‌: లక్ష, ఎఫ్‌.ఎన్‌.సి.సి: రూ.10 లక్షలు. దాదాపు 350మంది ఉద్యోగులు తమ ఒక రోజు వేతనాన్ని విరాళంగా అందజేశార అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X