twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    94 చిత్రాలకు పని చేశాను, ప్రతీ ఒక్కటి ఓ పాఠమే.. గురువును తలుచుకున్న తమన్

    |

    మెలోడి బ్రహ్మ మణిశ్వర స్వరాలు తెలియని వాడు, వినని వాడు ఉండడంటే అతిశయోక్తి కాదు. తెలుగు ప్రేక్షకులందరికీ మణిశర్మ పాటలు ఎంతో ప్రీతి. మెలోడి పాటలు అందించాలన్నా, మాస్ బీట్స్ కొట్టాలన్నా, సినిమాలో హీరోయిజాన్ని ఎలివేట్ చేయాలన్నా మణిశర్మ తరువాతే ఎవ్వరైనా. మధ్యలో కొన్నేళ్లు సంగీత దర్శకుడిగా సక్సెస్ రాకపోయినా.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదరగొట్టారు. నేడు మణిశర్మ పుట్టిన రోజు సందర్భంగా ఆయన అందించిన పాటలను గుర్తు చేసుకుంటూ.. బర్త్ డే విషెస్ చెబుతున్నారు.

    మణిశర్మ సంగీత దర్శకుడిగా పీక్స్‌లో ఉన్న కాలంలోనే తమన్ శిష్యరికం చేశాడు. తమన్ కూడా ఎన్నో సినిమాలకు మణిశర్మ వద్ద పని చేశాడు. ఆ మధ్య పోకిరి చిత్రానికి పదేళ్లు పూర్తి కావడంతో నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు తమన్. తన గురువైన మణిశర్మ గురించి చెప్పుకొచ్చాడు. 'ఓ అద్భుతమైన ఆల్బమ్, నా గురువు మణిశర్మ గారు చించేశారు.. అదిరిపోయే టాప్ క్లాస్ పరికరాలతో కొత్త శబ్దాలను కసితో పుట్టించాము.. పోకిరి అనేది మొత్తంగా కొత్త ప్రయోగం.. ఈ చిత్రం కోసం ప్రతీ ఒక్కటి కలిసి వచ్చింది.. లెజెండ్‌తో కలిసి పని చేయడం ఎంతో సంతోషంగా ఉంద'ని మణిశర్మ గురించి గొప్పగా చెప్పాడు.

     Thaman Special Birthday Wishes To Mani Sharma

    మణిశర్మకు సోషల్ మీడియాలో విషెస్ వెల్లువెత్తాయి. ఫ్యాన్స్, సెలెబ్రిటీస్, నెటిజన్లు మణిశర్మకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. తాజాగా తమన్ స్పందిస్తూ తన గురు భక్తిని చాటుకున్నాడు. 'నా గురువు గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆయన వద్ద 94 చిత్రాలకు పని చేశాను.. ప్రతీ ఒక్కటి ఒక్కో పాఠమే. 94 పాఠాలు నేర్చుకున్నాను. ఈ రోజు అనుభవిస్తున్న స్టేటస్‌కు ఆ ఎనిమిదేళ్ల శిష్యరికమే కారణం. మీ పట్ల ఎల్లప్పుడూ నాకు గౌరవమే. మున్ముందు మీకు మరింత మంచి జరగాల'ని కోరుకున్నాడు.

    English summary
    Thaman Special Birthday Wishes To Mani Sharma. Many many more happy returns to my GURU Heart suit TAT 94 films was my 94 lessons learnt in 8 years of my life which made me WHAT I AM TODAY’ White heartHeadphoneMusical keyboard Sir lots of love & respect
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X