Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
94 చిత్రాలకు పని చేశాను, ప్రతీ ఒక్కటి ఓ పాఠమే.. గురువును తలుచుకున్న తమన్
మెలోడి బ్రహ్మ మణిశ్వర స్వరాలు తెలియని వాడు, వినని వాడు ఉండడంటే అతిశయోక్తి కాదు. తెలుగు ప్రేక్షకులందరికీ మణిశర్మ పాటలు ఎంతో ప్రీతి. మెలోడి పాటలు అందించాలన్నా, మాస్ బీట్స్ కొట్టాలన్నా, సినిమాలో హీరోయిజాన్ని ఎలివేట్ చేయాలన్నా మణిశర్మ తరువాతే ఎవ్వరైనా. మధ్యలో కొన్నేళ్లు సంగీత దర్శకుడిగా సక్సెస్ రాకపోయినా.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదరగొట్టారు. నేడు మణిశర్మ పుట్టిన రోజు సందర్భంగా ఆయన అందించిన పాటలను గుర్తు చేసుకుంటూ.. బర్త్ డే విషెస్ చెబుతున్నారు.
మణిశర్మ సంగీత దర్శకుడిగా పీక్స్‌లో ఉన్న కాలంలోనే తమన్ శిష్యరికం చేశాడు. తమన్ కూడా ఎన్నో సినిమాలకు మణిశర్మ వద్ద పని చేశాడు. ఆ మధ్య పోకిరి చిత్రానికి పదేళ్లు పూర్తి కావడంతో నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు తమన్. తన గురువైన మణిశర్మ గురించి చెప్పుకొచ్చాడు. 'ఓ అద్భుతమైన ఆల్బమ్, నా గురువు మణిశర్మ గారు చించేశారు.. అదిరిపోయే టాప్ క్లాస్ పరికరాలతో కొత్త శబ్దాలను కసితో పుట్టించాము.. పోకిరి అనేది మొత్తంగా కొత్త ప్రయోగం.. ఈ చిత్రం కోసం ప్రతీ ఒక్కటి కలిసి వచ్చింది.. లెజెండ్‌తో కలిసి పని చేయడం ఎంతో సంతోషంగా ఉంద'ని మణిశర్మ గురించి గొప్పగా చెప్పాడు.
మణిశర్మకు సోషల్ మీడియాలో విషెస్ వెల్లువెత్తాయి. ఫ్యాన్స్, సెలెబ్రిటీస్, నెటిజన్లు మణిశర్మకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. తాజాగా తమన్ స్పందిస్తూ తన గురు భక్తిని చాటుకున్నాడు. 'నా గురువు గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆయన వద్ద 94 చిత్రాలకు పని చేశాను.. ప్రతీ ఒక్కటి ఒక్కో పాఠమే. 94 పాఠాలు నేర్చుకున్నాను. ఈ రోజు అనుభవిస్తున్న స్టేటస్‌కు ఆ ఎనిమిదేళ్ల శిష్యరికమే కారణం. మీ పట్ల ఎల్లప్పుడూ నాకు గౌరవమే. మున్ముందు మీకు మరింత మంచి జరగాల'ని కోరుకున్నాడు.