రెడీగా ఉన్నారా?.. హైప్ పెంచేస్తోన్న తమన్

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్‌కు అదిరిపోయే గిఫ్ట్ రెడీ అయినట్టు కనిపిస్తోంది. అసలే తెలుగు సినిమా ప్రపంచంలో ప్రస్తుతం తమన్ హవా నడుస్తోంది. అల వైకుంఠపురములో వంటి అదిరిపోయే ఆల్బమ్‌తో ప్రపంచాన్ని ఊపేశాడు తమన్. మహేష్ బాబుకు అద్భుతమైన పాటలు ఇచ్చేందుకు తమన్ కూడా రెడీ అవుతున్నాడు. మహేష్ బాబు బర్త్ డే (ఆగస్ట్ 9) సందర్భంగా ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్ ఇవ్వబోతోన్నట్టు పరోక్షంగా ప్రకటించాడు.

మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఓ స్పెషల్ ట్రీట్ ఇవ్వాలని సర్కారు వారి పాట టీమ్ డిసైడ్ అయింది. ఈ మేరకు గత వారం రోజులుగా ఊరించేస్తున్నాడు. అయితే ఈ మేరకు పరుశురామ్ చేసిన ట్వీట్ అందరిలోనూ ఆసక్తిని పెంచుతోంది. తాజాగా ఓ ట్యూన్ వినిపించాడని, అది అదిరిపోయిందని ప్రకటించాడు. ఈ మేరకు పరుశురామ్-తమన్ మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా చకచకా జరిగిపోతున్నాయని టాక్.

Thaman Surprise Gift For Superstar Fans On Mahesh Babu Birthday

తాజాగా తమన్ ఓ ట్వీట్ చేశాడు. సూపర్ స్టార్ ఫ్యాన్స్ రెడీగా ఉన్నారా? అంటూ తమన్ అందరిలోనూ ఉత్సాహాన్ని పెంచుతున్నాడు. ఇంకా మూడు రోజులే ఉంది అందరూ రెడీగా ఉన్నారా? అంటూ తమన్ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. బ్యాంకులను దోపీడీ చేసే బడా వ్యాపారవేత్తలపై మహేష్ బాబు చేసే పోరాటమే సర్కారు వారి పాట కథా సారాంశం అని తెలుస్తోంది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో షూటింగ్‌ను ఇప్పట్లో ప్రారంభించకూడదని చిత్రయూనిట్ నిర్ణయించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X