'ఎన్టీఆర్ 28' షూటింగ్ స్పాట్‌లో.. త్రివిక్రమ్‌తో ఆ ఇద్దరూ, యమజోరుమీద!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తొలిసారి ఓ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ చిత్రాలు ఫ్యామిలీ ఆడియన్స్ కు చేరువయ్యేలా ఉంటాయి. ఎన్టీఆర్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో చిత్రం అంటే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొని ఉండడం ఖాయం. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. టెంపర్ చిత్రం నుంచి ఎన్టీఆర్ జైత్ర యాత్ర కొనసాగుతోంది. ఎన్టీఆర్ అభిమానుల అంచనాలకు అనుగుణంగా ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నారు.

 హుషారుగా ఉన్న తమన్

హుషారుగా ఉన్న తమన్

వరుస విజయాలతో జోరు మీద ఉన్న తమన్ కు ఎన్టీఆర్ 28 చిత్రంలో అనుకోకుండా అవకాశం వచ్చింది. ఈ చిత్రానికి మొదట తమిళ సంగీత దర్శకుడు అనిరుద్ ని అనుకున్నారు. అనుకోని కారణాల వలన అతడి స్థానంలోకి తమన్ ని తీసుకున్నారు. ఈ చిత్రంలో అవకాశం వచ్చినప్పటి నుంచి తమన్ మంచి హుషారుగా పనిచేస్తున్నాడు.

Recommended Video

Pooja Hegde Starts To Improve Her Dancing Skills
మ్యూజిక్ సిట్టింగ్స్

మ్యూజిక్ సిట్టింగ్స్

ఓ వైపు ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతున్నా తమన్ తన పని తాను చేసుకుపోతున్నాడు. తాజగా ఎన్టీఆర్ 28 షూటింగ్ స్పాట్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మ్యూజిక్ సిట్టింగ్స్ తో బిజీగా ఉన్నాడు. వీరిద్దరితో దిగ్గజ రచయిత సిరివెన్నెల కూడా ఉండడం విశేషం.

గర్వంగా ఉంది

బలమైన కథలు రాసే త్రివిక్రమ్, అద్భుతమైన పాటలు రాసే సిరివెన్నెల సీతారామశాస్త్రితో కలసి పనిచేయడం గర్వంగా ఉందని తమన్ ట్విట్టర్ లో స్పందించాడు.

 అద్భుతమైన బాణీలు

అద్భుతమైన బాణీలు

ఈ మధ్య కాలంలో తమన్ సంగీతం అందించిన పాటలు ఆకట్టుకుంటున్నాయి. అదే ఉత్సాహంలో ఎన్టీఆర్ చిత్రానికి అదిరిపోయే ట్యూన్స్ ని సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. దసరా కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X