For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  'నాయక్‌' లో రామ్ చరణ్ డాన్స్ లు సూపర్బ్

  By Srikanya
  |

  హైదరాబాద్: వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ నటిస్తున్న చిత్రం 'నాయక్‌'. 'ది లీడర్' అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. రీసెంట్ గా ఆయన ఈ చిత్రంలో నాలుగు పాటలు చూసారు. ఆ విషయాలను వివరిస్తూ ట్వీట్ చేసారు. ఆ ట్వీట్ లో... "నాయకు క్లైమాక్స్ సాంగ్ పూర్తైంది... సూపర్ హ్యాపీగా ఉంది. నాయక్ ఆడియో డిసెంబర్ లో... నాయక్ లో నాలుగు పాటలు చూసాను.. పెంటాస్టిక్ విజువల్స్,కొరియాగ్రఫీతో సూపర్బ్ గా ఉన్నాయి. డెఫినట్ గా చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ గా సూపర్ సక్సెస్ అవుతుంది" అని ట్వీట్ చేసారు.

  నాయక్ చిత్రం ప్రస్తుతం కలకత్తాలో షూటింగ్ జరుగుతోంది. రామ్ చరణ్ మొదటిసారిగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. కాజల్‌, అమలా పాల్‌ హీరోయిన్లు గా చేస్తున్నారు జనవరి 9న సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ క్యారక్టర్ సమాజానికి ఉపయోగపడేలా ఉంటుంది. రామ్ చరణ్ ని అన్యాయాన్ని ఎదిరించే యువకుడిగా చూపిస్తున్నారు. గతంలో రామ్ చరణ్ తండ్రి చిరంజీవి చిత్రాలలో కూడా హీరో ..సమాజంలో జరిగే అన్యాయాలను ఎదురించి పోరాడే వాడు. అదే స్టైల్ లో రామ్ చరణ్ కూడా మెగాభిమానులను అలరించనున్నారు.

  ఈ పాత్ర గురంచి రచయిత ఆకుల శివ మాట్లాడుతూ.. ''సందేశాన్ని కూడా వినోదం మేళవించి చెప్పినప్పుడే రక్తికడుతుంది. అదీ జనాదరణ ఉన్న హీరోతో చెప్పిస్తే ఎక్కువమందికి చేరుతుంది. చిరంజీవి రక్తదానం గురించి చెప్పారు కాబట్టే అవగాహన ఏర్పడింది. కాబట్టి మనం ప్రేక్షకులకు మంచి విషయం చెప్పాలనుకొన్నప్పుడు ఓ స్టార్‌ ద్వారా అతని ఇమేజ్‌కి తగ్గ కథలో మేళవించి చెప్పాలి. ఎక్కడా వాణిజ్య విలువలు వదులుకోకూడదు. ఇప్పుడు రామ్‌చరణ్‌ చిత్రంలో అంతర్లీనంగా కొన్ని విషయాలు చెప్పబోతున్నాము''అన్నారు.

  ఈ చిత్రంలో కథ... తండ్రికిచ్చిన మాట కోసం తనయుడు ఏం చేశాడనే పాయింట్ చుట్టూ తిరుగుతుంది. చిన్నపాటి టెన్షన్ తోపాటు మంచి యాక్షన్‌ సీన్స్ ఉంటాయి. ఎంటర్టైన్మెంట్ ఏ మాత్రం తగ్గని సినిమా. చిరంజీవిగారితో 'ఠాగూర్‌' తీసిన రోజులు గుర్తొస్తున్నాయి. తప్పకుండా అందరినీ మెప్పించే సినిమా తీస్తున్నామని దర్శకుడు వినాయక్‌ అన్నారు. నిర్మాత ఈ చిత్రం గురించి మాట్లాడుతూ... చరణ్‌ని ఒక కొత్త తరహా పాత్రలో చూపెట్టబోతున్నారు అన్నారు.

  English summary
  Thaman tweeted, "Completed climax song for #naayak super happy :) with the song :) heyyyyyyyy naayak audio in dec :) Saw 4 songs from # naayak :) superb fantastic visuals and superb choreography :) definitely goona be a super success action entertainer" (sic). Nayak is currently being filmed in Kolkata and the audio launch will be held in December.Directed by VV Vinayak and story written by Akula Shiva, DVV Danayya and Radhakrishna are jointly producing the film under Universal Media banner. Nayak is slated for release on January 9, 2013.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more