4 పాటలు, అదిరిపోయే ఫైట్స్, డైలాగ్స్ : తమన్
'రామయ్యా వస్తావయ్య సినిమాకు 4 పాటలు పూర్తయ్యాయి. ఇటీవలే సినిమాకు సంబంధించిన కొన్ని సీన్లు చూసాను. యాక్షన్ సీన్లు సూపర్ గా ఉన్నాయి. ఇక జూ ఎన్టీఆర్ చెప్పే డైలాగులు మైండ్ బ్లోయింగ్. సినిమా అదిరి పోవడం ఖాయం' అంటూ ట్వీట్ చేసాడు తమన్.
ఈ చిత్రంలో జూ ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోంది. శృతి హాసన్ ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రం పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టెనర్ గా రూపొందుతున్న ఈ మూవీలో ఎన్టీఆర్ స్టూడెంట్ లీడర్ పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ బాడీ ప్రదర్శిస్తారని తెలుస్తోంది.
ఈ సిక్స్ ప్యాక్ కోసం ఎన్టీఆర్ ఇంటర్నేషనల్ ఫిటినెస్ ట్రైనర్...John Shumate ఆధ్వర్యంలో ట్రైనింగ్ తీసుకుంటున్నారు. బాద్షాలో చేసిన అజీజ్ ఖాన్..ఎన్టీఆర్ కు ఈ ట్రైనర్ ని పరిచయం చేసారు. అజీజ్ ఖాన్ మాట్లాడుతూ..." ఎన్టీఆర్ తన ఫిజిక్ ఫిటినెస్ కోసం చాలా శ్రద్దగా వర్కవుట్స్ చేస్తున్నారు. ఆయన మంచి ట్రైనర్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో జాన్ పేరుని నేను ప్రపోజ్ చేసాను. ఎన్టీఆర్..ఫ్యాన్స్ కు ఇది పండుగలా ఉంటుంది" అన్నారు.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్ పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: చోటా కె. నాయుడు, సంగీతం: తమన్, కూర్పు: గౌతం రాజు, ఆర్ట్: బ్రహ్మ కడలి, స్ర్కీన్ ప్లే: రమేష్ రెడ్డి, సతీష్ వేగ్నేశ, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్, నిర్మాత దిల్ రాజు, కథ-మాటలు-దర్శకత్వం: హరీష్ శంకర్ ఎస్.


Click it and Unblock the Notifications












