twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మాజీ ప్రధాని మనవడితో తమన్నా ఐటం సాంగ్, ఎంత చార్జ్ చేస్తుందో తెలుసా?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: నిఖిల్‌ కుమార్‌ హీరోగా హెచ్‌.డి. కుమారస్వామి సమర్పణలో చన్నాంబిక ఫిలింస్‌ బ్యానర్‌పై ఎ.మహాదేవ్‌ దర్శకత్వంలో అనితా కుమారస్వామి నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం 'జాగ్వార్‌'. ఈ నిఖిల్ కుమార్ ఎవరో కాదు... మాజీ ప్రధాన మంత్రి దేవెగౌడ మనవడు, కన్నడంలో అనేక సూపర్‌హిట్‌ చిత్రాలు నిర్మించిన హెచ్‌.డి. కుమారస్వామికి తనయుడు.

    75 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను కన్నడతో పాటు తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. నిఖిల్ కుమార్ తండ్రే నిర్మాత కావడంతో ఖర్చుకు ఏమాత్రం వెనకాడటం లేదు. టీజర్ రిలీజ్ కార్యక్రమం కూడా హైదరాబాద్ లో ప్రముఖుల మధ్య గ్రాండ్ గా నిర్వహించారు.

    ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి తీస్తునప్న సినిమాలో ఐటం సాంగ్ లేకుంటే ఎలా? అదే ఆలోచన దర్శక నిర్మాతలకు వచ్చింది. సినిమాకు పెడుతున్న ఖర్చుకు తగ్గట్లే ఐటం సాంగ్ అదిరిపోవాలని భావించారు. సౌత్ లో మంచి క్రేజ్ ఉన్న తమన్నా అయితేనే ఐటం సాంగుకు పర్ఫెక్ట్ అని భావించిన నిర్మాతలు ఆమెను సంప్రదించారు. ఇందుకోసం తమన్నా రూ. కోటి డిమాండ్ చేసిందట. చివరకు రూ. 75 లక్షల కు తమన్నా ఐటం సాంగ్ చేయడానికి ఓకే చెప్పినట్లు సమాచారం.

    స్లైడ్ షోలో మరిన్ని వివరాలు..

    అన్నపూర్ణ స్టూడియోలో

    అన్నపూర్ణ స్టూడియోలో

    అన్నపూర్ణ స్టూడియోలో వేసిన స్పెషల్ సెట్లో తమన్నా, నిఖిల్ కుమార్ లపై స్పెషల్ సాంగ్ చిత్రీకరించనున్నారు.

    టెక్నీషియన్స్

    టెక్నీషియన్స్

    బాహుబలికి కథను అందించిన విజయేంద్రప్రసాద్‌ ఈ సినిమాకు కథ అందించడం గమనార్హం. జగపతిబాబు సిబిఐ ఆఫీసర్‌ పాత్ర పోషిస్తున్నారు. థమన్‌, మనోజ్‌ పరమహంస వంటి టాప్‌ టెక్నీషియన్స్‌ వర్క్‌ చేశారు.

    పవన్ కళ్యాణ్

    పవన్ కళ్యాణ్

    ఈ సినిమా తెరకెక్కుతోంది కన్నడలోనే అయినా... తెలుగు మార్కెట్ మీద బాగా ఫోకస్ పెట్టారు. అందుకే సెప్టెంబర్ 18న ఈ సినిమాకు సంబంధించిన ఆడియో రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో గ్రాండ్ ప్లాన్ చేసారు. ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు.

    ఐటం సాంగుకే అంతా

    ఐటం సాంగుకే అంతా

    తమన్నాతో ఐటం సాంగు చేయించడానికి ఆమె రూ. 75లక్షల రెమ్యూనరేషన్ ఇవ్వడం చర్చనీయాంశం అయింది. కన్నడలో ఒక స్థాయి హీరోయిన్లు కూడా రేంజిలో రెమ్యూనరేషన్ అందుకోవడం లేదు.

    నిర్మాత కుమార స్వామి

    నిర్మాత కుమార స్వామి

    నిర్మాత హెచ్‌.డి. కుమారస్వామి మాట్లాడుతూ..ఈ సినిమాని తెలుగులో చేయడానికి కారణం విజయేంద్రప్రసాద్‌గారు. కథ చెప్పడానికి వచ్చిన ఆయన కన్నడలోనే సినిమా ఎందుకు చేస్తున్నారు? తెలుగులో కూడా చేయండి. మీ అబ్బాయి మంచి హీరో అవుతాడని ఆయన అన్న మాటతో ఈ సినిమాను కన్నడ, తెలుగులో చేస్తున్నాను అన్నారు.

    నిఖిల్ కుమార్

    నిఖిల్ కుమార్

    నాకు తెలుగంటే ఇష్టం. ఎక్కువగా తెలుగు సినిమాలను చూస్తుంటాను. విజయేంద్ర ప్రసాద్‌గారు మా నాన్నగారిని కలవడానికి వచ్చినపుడు మీ అబ్బాయిని మా అబ్బాయి అనుకుని నా చేతుల్లో పెట్టండి అన్నారు. అది నాకిప్పటికీ గుర్తే. అలా మంచి కథను సిద్ధం చేశారు. మా నాన్నగారు నాకోసం ఎంతో చేశారు. ఆయనకు నేను ఏం చేసినా తక్కువే అవుతుంది అన్నారు.

    జగపతి బాబు

    జగపతి బాబు

    ''తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంటరై పెద్ద నిర్మాతగా ఎదగాలని, కుమారుడ్ని పెద్ద హీరో చేయాలనే తపన కుమారస్వామి గారిలో కనబడుతోంది. ఓ సందర్భంలో నిఖిల్‌ గురించి అడిగినపుడు రాష్ట్రం కోసం ఎంతో చేశాను. నా కొడుకు కోసం ఈమాత్రం చేయలేనా అన్నారు. ఈ సినిమాకు హాలీవుడ్‌ టెక్నీషియన్స్‌ కూడా పనిచేశారు. ఇలాంటి సినిమాలో నేను పార్ట్‌ కావడాన్ని ప్రివిలేజ్‌గా భావిస్తున్నాను'' అన్నారు.

    విజయేంద్ర ప్రసాద్

    విజయేంద్ర ప్రసాద్

    విజయేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ - ''మొదటిసారి నన్ను పిలిచి కథ రాయమన్నప్పుడు ఏం రాద్దాంలే అనుకున్నాను. నిఖిల్‌కి సంబంధించిన ఒక వీడియో క్లిప్‌ చూశాక తనలో స్పార్క్‌ చూసి తను ఒక డైమండ్‌ అని అర్ధమైంది. నాపై నమ్మకంతో నిఖిల్‌ను నాకు అప్పగించారు. మహదేవ్‌ సినిమాని కష్టపడి తెరకెక్కిస్తున్నాడు. ఆల్‌ ది బెస్ట్‌'' అన్నారు.

    నటీనటులు

    నటీనటులు

    నిఖిల్‌కుమార్‌, దీప్తి జంటగా నటించిన ఈ చిత్రంలో జగపతిబాబు, రఘుబాబు, బ్రహ్మానందం, సంపత్‌, ఆదిత్యమీనన్‌, భజ్రంగ్‌ లోకేష్‌, అవినాష్‌, వినాయక్‌ జోషి, ప్రశాంత్‌, సుప్రీత్‌ రెడ్డి, రావు రమేష్‌, రమ్యకృష్ణ తదితరులు నటించిన

    తెర వెనక

    తెర వెనక

    ఈ చిత్రానికి సమర్పణ: హెచ్‌.డి. కుమారస్వామి, కథ: విజయేంద్ర ప్రసాద్‌, సినిమాటోగ్రఫి: మనోజ్‌ పరమహంస, మ్యూజిక్‌: యస్‌.యస్‌. థమన్‌, ఆర్ట్‌: నారాయణరెడ్డి, సాహిత్యం: రామజోగయ్యశాస్త్రి, ఫైట్స్‌: రవివర్మ, రామ్‌-లక్ష్మణ్‌, కలోయాన్‌ (బల్గేరియా), సెల్వ, కో డైరెక్టర్‌: అమ్మినేని మాధవసాయి, నిర్మాత: శ్రీమతి అనితా కుమారస్వామి, స్క్రీన్‌ప్లే - మాటలు - దర్శకత్వం: ఎ. మహదేవ్‌.

    English summary
    Nikhil Kumar, who is grandson of Ex-Prime Minister HD Deve Gowda and son of Karnataka's Ex-Chief minister, Popular distributor, Producer HD Kumara Swamy is debuting as Hero with a 75 crore big budgeted film 'Jaguar'. I am very happy that my son Nikhil Kumar impressed everyone with his first look itself. 'Jaguar' is getting very good offers from trade circles. All the Top Technicians,Artists are working for this film. Glamour queen, milky beauty Thamannah is doing a special song in this film. This song will be a major plus for the film.This song will be picturised in huge sets erected in Annapurna 7 acres, Hyderabad from September 5th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X