చిరంజీవి సైరాలో తమన్నా పాత్ర అదేనట, మరోసారి తమన్నా నటవిశ్వరూపం!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా సైరా నరసింహారెడ్డి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. తాజాగా అమితాబ్ బచ్చన్, నయనతార ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొనడం జరిగింది. షూటింగ్ సమయంలో తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో హాల్ చల్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాకు రామ్ చరణ్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు, స్వాతంత్ర సమరయోధుడి పాత్రలో చిరంజీవి నటించబోతున్న ఈ సినిమాలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతోంది. జగపతిబాబు ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడు. తాజా సమాచారం మేరకు నీహారిక ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతోందని సమాచారం.

కథలో ఒక కీలకమైన పాత్ర కోసం తమన్నా అయితే బాగుంటుందని, ఆమెనే ఆ పాత్ర కోసం తీసుకోవాలని అనుకున్నారు చిత్ర యూనిట్. తాజా సమాచారం మేరకు తమన్నా ఈ సినిమాలో వారియర్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాతో పాటు తమన్నా వెంకటేష్ సరసన నటిస్తోంది. వరుణ్ తేజ్ ఈ సినిమాలో మరో హీరోగా నటిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











