twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'కత్తి'లో తెలియని కోణాలు.., కొట్టి చెప్పమంటారా?: పవన్ ఫ్యాన్స్‌తో వివాదంపై తమ్మారెడ్డి

    |

    Recommended Video

    'కత్తి' లో తెలియని కోణాలు.. ఫ్యాన్స్‌తో వివాదంపై తమ్మారెడ్డి !

    ఓవైపు ఫ్యాన్స్ దూకుడు.. మరోవైపు వెనక్కి తగ్గని కత్తి.. వెరసి నెలల తరబడి నిత్యం వార్తల్లో నానుతున్న వివాదం. ఈ వివాదానికి క్లైమాక్స్ ఏంటనేది ఇంతవరకు ఎవరికీ అంతుచిక్కడం లేదు. 'అజ్ఞాతవాసి' ఫలితం గనుక మరోలా ఉండి ఉంటే పవన్ ఫ్యాన్స్ వర్సెస్ కత్తి యుద్దం మరోలా ఉండేదేమో!.

    సరే, అంతకుముందే రచయిత కోన వెంకట్ ఓ డెడ్ లైన్ కూడా ప్రకటించేశారు. ఆ డెడ్ లైన్ తర్వాత ఏం చేయబోతున్నారన్నదే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోన్న అంశం. ఇకపోతే ఈ వైరాన్ని సద్దుమణిగించే నాథుడే ఇండస్ట్రీలో కరువయ్యాడా? అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి తరుణంలో నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు.

    పవన్ కల్యాణ్‌కు 'ఓయూ' హెచ్చరిక: 'కత్తి' జోలికొస్తే?..పవన్ కల్యాణ్‌కు 'ఓయూ' హెచ్చరిక: 'కత్తి' జోలికొస్తే?..

     వివాదంపై తమ్మారెడ్డి..:

    వివాదంపై తమ్మారెడ్డి..:

    ఈ విషయంలో కత్తి మహేష్‌కి నేను చాలా సార్లు చెప్పాను. మన అభిప్రాయం ఎదుటివాళ్లకి నచ్చనప్పుడు వాళ్లు తిడతారు. మళ్లీ దానిపై రెస్పాండ్ అయితే ఇలాగే ఉంటుంది.

     నేను కూడా తిట్టాను:

    నేను కూడా తిట్టాను:

    నేను కూడా హీరోలను తిట్టాను. నన్ను ఆ హీరోల అభిమానులు తిడుతూ పోస్ట్‌లు చేస్తుంటారు. వాటిపై నేను మళ్లీ రెస్పాండ్ అయితే పెద్ద వివాదం అవుతుంది. అందుకే తిడితే తిట్టారులే అని ఊరుకుంటాను. అంతే ఫుల్ స్టాప్. ఇదే విషయం కత్తి మహేష్‌కి చాలా సార్లు చెప్పారు. అయినా వినలేదు.

    మహేష్ కత్తి: బిగ్ బాస్‌తో మొదలై.. పవన్‌తో యుద్దం దాకా..మహేష్ కత్తి: బిగ్ బాస్‌తో మొదలై.. పవన్‌తో యుద్దం దాకా..

     కొట్టి చెప్పమంటారా?:

    కొట్టి చెప్పమంటారా?:

    పవన్ కల్యాణే రావాలి. నా సమస్య తీర్చాలి అంటే నేనేం చేయను. కొట్టి చెప్పమంటారా? తిట్టి చెప్పమంటారా?.. ఇప్పటికీ చాలాసార్లు చెప్పాను.

    నావల్ల కాదు..:

    నావల్ల కాదు..:

    ఈ వివాదంతో నీవు రోజురోజుకీ దిగజారిపోతున్నావని కూడా మహేష్ కత్తికి చెప్పి చూశా. ఇంకా ఏం చేయాలి? ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టడం నా వల్ల కాదు. నేను రాజీ చేయలేను.

     కత్తిలో తెలియని కోణాలు:

    కత్తిలో తెలియని కోణాలు:

    మహేష్ కత్తి గురించి నాకు చాలా తెలుసు. సినీ విమర్శకుడి కోణం మాత్రమే కాదు సామాజికంగా.. సాంస్కృతికంగా.. రాజకీయంగా.. మహేష్ కత్తి మంచి తెలివి తేటలు ఉన్న వ్యక్తి. యాక్టివిస్ట్ గానూ ఉన్నాడు.

    అయితే అనవసరంగా ఈ వివాదాన్ని సాగదీయడం వల్ల తనూ డిస్టర్బ్ అయ్యాడు. మ‌హేశ్ కత్తి.. త‌న మానాన త‌ను మంచి బ‌తుకు బతుకుతున్నాడు.. ఫైనాన్షియల్‌గా కాదు.. విలువలతో. కానీ ఈ వివాదం వల్ల ఆయనకే నష్టం జరుగుతుందేమో!

    తెగేదాకా వచ్చింది: 'కత్తి'కి కోన వెంకట్ డెడ్ లైన్?, ఆరోజు ఏం చేస్తారు?; సీన్ లోకి వేణుమాధవ్..తెగేదాకా వచ్చింది: 'కత్తి'కి కోన వెంకట్ డెడ్ లైన్?, ఆరోజు ఏం చేస్తారు?; సీన్ లోకి వేణుమాధవ్..

     సాగదీస్తే కష్టం:

    సాగదీస్తే కష్టం:

    సాగదీస్తే ఎంతదూరమైనా సాగే అవకాశం ఉంది కాబట్టి.. ఇకనైనా దీనికి ముగింపు పలకాల్సిన అవసరముంది. ఇరువురు సంయమనం పాటిస్తే మంచిది. విమర్శలు ఇలాగే కొనసాగుతూ పోతే ఎంతదూరమైన వెళ్లవచ్చు.

    English summary
    Producer and Director Thammareddy Bharadwaja responded on Film critic Mahesh Kathi VS Pawan Kalyan fans issue.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X