చిరంజీవి అంటే జెలసీ ఎందుకు?.. పిచ్చి పిచ్చి ఆలోచనలు మానండి.. తమ్మారెడ్డి ఫైరింగ్ కామెంట్స్

Recommended Video

Thammareddy Bharadwaja Vs Mega Fans || పిచ్చి పిచ్చి ఆలోచనలు మానండి : తమ్మారెడ్డి

సైరా నరసింహా రెడ్డి సినిమా విషయమై దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ కొన్ని కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కామెంట్స్ చూసిన కొందరు తమ్మారెడ్డిపై విరుచుకుపడ్డారు. ఆయనను ట్రోల్ చేశారు. దీంతో తాజాగా మరో వీడియో రూపంలో ఈ విషయంపై మాట్లాడుతూ తనను ట్రోల్ చేసిన వారికి చురకలంటించారు తమ్మారెడ్డి. ఆ వివరాలు చూస్తే..

తమ్మారెడ్డి భరద్వాజ కామెంట్.. మెగా ఫ్యాన్స్ ఫైర్

తమ్మారెడ్డి భరద్వాజ కామెంట్.. మెగా ఫ్యాన్స్ ఫైర్

ఈ రోజుల్లో ఓ సినిమా ఎన్ని రోజులు ఆడుతుందన్నది ముఖ్యం కాదు.. ఎంత రెవెన్యూ వసూలు చేసిందన్నదే ముఖ్యం. యావరేజ్ టాక్‌ తెచ్చుకున్న ‘సాహో' చిత్రమే 200 నుంచి 300 కోట్ల మేర వసూళ్లు రాబట్టింది. ఇక సైరా ఏం చేస్తుందో చూడాలి అంటూ ఇటీవలే సైరా కలెక్షన్లపై తమ్మారెడ్డి భరద్వాజ కామెంట్ విసిరారు. దీంతో ఆగ్రహించిన మెగా అభిమానులు ఆయనపై ఫైర్ అయ్యారు.

చిరంజీవి అంటే జెలసీ ఎందుకు..

చిరంజీవి అంటే జెలసీ ఎందుకు..

దీంతో తాజాగా ఇదే విషయమై మరో వీడియో ద్వారా అందరి ముందుకొచ్చారు తమ్మారెడ్డి. ఈ వీడియో ద్వారా తనను ట్రోల్ చేసిన వారిపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. అసలు చిరంజీవి అంటే తనకెందుకు జెలసీ? అంటూ సూటి ప్రశ్న వేశారు. గతంలో తాను చేసిన ఈ కామెంట్ అర్థం ఇదీ అని వివరిస్తూ అర్థం చేసుకొని వాళ్ళు అర్థం చేసుకోండి అని అన్నారు.

 అందులో తప్పేముందో నాకైతే అర్థం కాలేదు

అందులో తప్పేముందో నాకైతే అర్థం కాలేదు

ఈ వీడియోలో తమ్మారెడ్డి మాట్లాడుతూ.. ''నేను వారం రోజుల క్రితం సైరా సినిమా గురించి ఒక పోస్ట్ పెట్టాను. అది నేను సైరా రిలీజ్‌కి ముందు విడుదల చేశా. దాన్ని తప్పుగా అర్ధం చేసుకున్నారు. కలెక్షన్ల విషయంలో నేను ఏదో తప్పుగా మాట్లాడినట్టుగా నెగిటివ్ పోస్ట్‌లు పెట్టారు. నేను మాట్లాడిన దాంట్లో తప్పేం ఉందో నాకు అర్ధం కాలేదు. ఆదివారం కంటే ముందే సైరా 300 కోట్లు వసూలు చేస్తుందని చెప్పా. ఒక్క బాహుబలి తప్ప వీకెండ్ ముందు 300 కోట్లు వసూలు చేసిన సినిమా హిందీలో కూడా లేదు. అయితే సైరా ఆ రికార్డుల్ని బ్రేక్ చేస్తుందని చెప్తే దాంట్లో నేను తప్పుగా మాట్లాడింది ఏంటో అర్ధం కాలేదు అని అన్నారు.

నాకు ఆ అవసరం ఏంటి?

నాకు ఆ అవసరం ఏంటి?

నేను చిరంజీవిని చూసి జెలసీ ఫీల్ అవుతున్నానని అంటున్నారు. అయినా నేను ఒకర్ని చూసి ఎందుకు జెలసీగా ఫీల్ కావాలి? అంత అవసరం నాకేంటి? చిరంజీవిని చూస్తే నాకు జెలసీ ఎందుకు? ఆయన నటుడు, నేను దర్శకుడ్ని, నిర్మాతని. అసలు నాకు ఈ వయసులో జెలసీ దేనికి. నేను ఆయనలా నటుడ్ని కాలేను. ఆయన నిర్మాత కాదు, దర్శకుడు కాదు. అలాంటప్పుడు నాకు జెలసీ ఎందుకు ఉంటుంది అని అన్నారు తమ్మారెడ్డి.

సైరా రికార్డ్స్ సాధిస్తుందనే చెప్పా

నేను సైరా రికార్డ్స్ సాధిస్తుందనే చెప్పా దాన్ని కూడా ట్రోల్స్ చేస్తుంటే నేను ఏం చెప్పాలి. నేను యూట్యూబ్‌‌లో వ్యూస్ కోసం, డబ్బుల కోసం వీడియోలు పెడుతున్నారని కూడా అంటున్నారు. అదే నిజం అయితే చిరంజీవి తిడితే ఎక్కువ వ్యూస్ వస్తాయి. లేదా బాగా పొగిడితే వస్తాయి. నేనలా చేయలేదే.. ఆయన సినిమాకి మంచి కలెక్షన్లు వస్తాయనే అన్నా తప్ప ఇంకేం చెప్పలేదే అని అన్నారు.

పిచ్చి పిచ్చి కామెంట్స్ చేయకండి

పిచ్చి పిచ్చి కామెంట్స్ చేయకండి

ప్రతీ విషయాన్ని నెగిటివ్‌గా ఆలోచించడం మానేయండి. పిచ్చి పిచ్చి కామెంట్స్ చేయకండి. దీనిపై నేను స్పందించాల్సిన అవసరం లేదు కాని.. 96 శాతం నన్ను వ్యతిరేకించారని అన్నారు కాబట్టే ఇది చెప్పాల్సి వచ్చింది. ఒకవేళ నేను నెగిటివ్ అయితే నన్ను వదిలేయండి. మీరు మాత్రం పాజిటివ్ గా ఉండండి. ఆరోగ్యం చెడగొట్టుకోకండి అని కౌంటర్ వేశారు తమ్మారెడ్డి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X