జబర్దస్త్ షో, నాగబాబుపై సీనియర్ దర్శకుడి షాకింగ్ కామెంట్స్.. సంచలనం

బుల్లితెర ఖతర్నాక్ కామెడీ షో, మెగా బ్రదర్ నాగబాబుపై సీనియర్ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేశారు. జబర్దస్త్ షో నుంచి నాగబాబు నిష్క్రమించడం, మరికొంత మంది కమెడియన్లు కూడా అదే బాటలో వెళ్లడం హాట్ టాపిక్ అయిన ఈ తరుణంలో తమ్మారెడ్డి భరద్వాజ నోరువిప్పడం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి పోతే..

 జబర్దస్త్ షో.. సమాజానికి ఏం ఉపయోగం?

జబర్దస్త్ షో.. సమాజానికి ఏం ఉపయోగం?

ఇటీవలే ఓ మీడియాకు ఇచ్చినఇంటర్వ్యూలో జబర్ధస్త్ షో పై తన అభిప్రాయాలను చెబుతూ షాకిచ్చారు తమ్మారెడ్డి. ఈ షో వల్ల సమాజానికి ఏం ఉపయోగం అంటూ ఆయన ప్రశ్నించారు. నిజం చెప్పాలంటే.. తాను ఇంతవరకూ జబర్దస్త్ షో చూడలేదని, ఒక్కటంటే ఒక్క ఎపిసోడ్ కూడా చూసింది లేదని తమ్మారెడ్డి పేర్కొన్నారు.

ఆ యాభై చూశా.. అస్సలు బాగా లేదు

ఆ యాభై చూశా.. అస్సలు బాగా లేదు

కాకపోతే జబర్దస్త్ షో అనేది నెంబర్ వన్ షో అని మాత్రం విన్నానని అన్నారు. అప్పట్లో శ్యాం ప్రసాద్ రెడ్డి గారు జబర్దస్త్ షోకి సంబంధించి 50 స్కిట్స్ సీడీలను తెచ్చి ఇచ్చారని, ఆ యాభై చూశాక అందులో ఒక్కటి కూడా అస్సలు బాగా లేదని తాను చెప్పానని అన్నారు. చండాలంగా ఉన్న ఈ షో ఇంత పెద్ద షో ఎలా అయిందయ్యా అని చెప్పేసి ఆ సీడీలను శ్యాం ప్రసాదర్ రెడ్డి గారికి రిటర్న్ ఇచ్చేశానని తమ్మారెడ్డి తెలిపారు.

జబర్దస్త్ ఉంటే ఏంటి? ఊడితే ఏంటి?

జబర్దస్త్ ఉంటే ఏంటి? ఊడితే ఏంటి?

జబర్దస్త్ షో వల్ల సమాజానికి ఏం ఉపయోగం లేదని తమ్మారెడ్డి తెలిపారు. ప్రసాద్ రెడ్డి ఇచ్చిన స్కిట్స్ చూసిన తరువాత తనకు జబర్దస్త్‌పై పూర్ ఒపీనియర్ ఏర్పడిందని అన్నారు. జబర్దస్త్ ఉంటే ఏంటి? ఊడితే ఏంటి? లోకల్ గ్యాంగ్ వస్తే ఏంటి పోతే ఏంటి? కొత్త కార్యక్రమం వచ్చిందని కాని.. పాత కార్యక్రమాలను మానేస్తున్నారని కాని తనకు తెలియదు.. తెలిసినా పట్టించుకోనని అన్నారు.

 మెగాబ్రదర్ నాగబాబుపై కామెంట్

మెగాబ్రదర్ నాగబాబుపై కామెంట్

అలాగే మెగాబ్రదర్ నాగబాబు జబర్దస్త్ షో నుండి తప్పుకోవడంపై స్పందిస్తూ.. ఎవరిష్టం వాళ్ళది.. నచ్చితే ప్రోగ్రామ్ చేస్తారు, లేకపోతే లేదు. ఇందులో ఎవ్వరినీ తప్పుపట్టాల్సిన అవసరం లేదని తమ్మారెడ్డి చెప్పారు. గత 15 ఏళ్లలో తాను రెండే సినిమాలు చేశానని, దాంతో ఉన్న సొమ్ము ఉంచుకున్న సొమ్ము అన్నీ పోయాయని చెప్పారు.

 ఆయనే మోనార్క్.. తమ్మారెడ్డి సంచలనం

ఆయనే మోనార్క్.. తమ్మారెడ్డి సంచలనం

ఈ మధ్యకాలంలో వచ్చే సినిమాల్లో హీరోదే డామినేట్ ఉంటోందని అన్నారు. దర్శకుడు, నిర్మాత, హీరోయిన్ ఇలా చాలామంది ఉన్నప్పటికీ అన్ని విషయాల్లోనూ ఆయనదే డామినేట్ అని తమ్మారెడ్డి తెలిపారు. నేటి సినిమాకు హీరోనే మోనార్క్‌గా ఉంటున్నాడని చెబుతూ సంచలనం సృష్టించారు తమ్మారెడ్డి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X