లూసిఫర్ రీమేక్‌కు దర్శకుడు దొరికాడోచ్.. ఎవ్వరూ ఊహించనట్టుగా షాకిచ్చిన చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమాతో బిజీగా ఉన్నాడు. అయితే ఈ మూవీ తరువాత చిరు చేయబోయే మూడు ప్రాజెక్ట్‌లు రెడీగా ఉన్నాయి. వీటి గురించి చిరంజీవి ఏనాడో ఓ క్లారిటీ ఇచ్చాడు. తాను బాబీ, మెహర్ రమేష్, వివి వినాయక్‌లతో సినిమా చేయబోతోన్నానని చెప్పుకొచ్చాడు. అందులో రెండు సినిమాలు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఒకటి తమిళంలో హిట్ అయిన వేదాళం, రెండోది మళయాలీ బ్లాక్ బస్టర్ లూసిఫర్.

వేదాళం ఫిక్స్..
అయితే ఇందులో వేదాళం రీమేక్‌కు మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్నాడు. అందులో ఎలాంటి అనుమానం లేదు. అయితే మిగిలిందల్లా లూసిఫర్ గురించే. ఈ రీమేక్ కోసం ఎంతో మంది దర్శకులు లైమ్ లైట్‌లోకి వచ్చారు వెళ్లారు. కొంత మంది దాదాపు ఫిక్స్ అయినట్టే అంటూ వార్తలు వచ్చాయి. కానీ చివరకు మాత్రం అందరికీ షాక్ ఇచ్చాడు చిరు.

ఆ ముగ్గురు అవుట్..
మొదటగా లూసిఫర్ రీమేక్ కోసం యంగ్ టాలెంటెడ్ సుజీత్‌ను తీసుకున్నారు. కానీ చివరకు వెనక్కి వెళ్లిపోయాడు. ఆ తరువాత వివి వినాయక్ చేతిలో లూసిఫర్ పడింది. కానీ పూర్తి స్థాయి స్క్రిప్ట్, మార్పులు చేర్పులు చిరుకు నచ్చేలా చేయలేకపోయాడని టాక్ బయటకు వచ్చింది. ఆ తరువాత హరీష్ శంకర్ పేరు కూడా వినిపించింది.

ఎవ్వరూ ఊహించని పేరు..
అయితే చిరు తన రీమేక్ సినిమా కోసం ఎవ్వరూ ఊహించిన పేరును ప్రకటించాడు. ధృవ సినిమా కథను అందించినవాడు.. తమిళంలో ఆసినిమాను దర్శకత్వం వహించిన మోహన్ రాజా (ఎడిటర్ మోహన్ తనయుడు)ను లూసిఫర్ రీమేక్‌కు డైరెక్టర్‌గా ఫిక్స్ చేశాడు. హనుమాన్ జంక్షన్ సినిమా తరువాత మోహన్ రాజా మరో తెలుగు సినిమాకు దర్శకత్వం వహించలేదు. మళ్లీ ఇన్నాళ్లకు ఇలా తెలుగు ప్రేక్షకులను పలకరిచనున్నాడు.
Recommended Video

రామ్ చరణ్ వల్లే..
అయితే ఇలా ఈ ప్రాజెక్ట్ లోకి మోహన్ రాజా ఎంట్రీ ఇవ్వడం వెనుక రామ్ చరణ్ హస్తం ఉందని తెలుస్తోంది. ఎందుకంటే ధృవ సినిమా సమయంలో కథను అందించిన మోహన్ రాజాను బాగా పొగిడేశాడు. అలా అక్కడ ఏర్పడిన బంధంతోనే ఇలా లూసిఫర్ రీమేక్‌లోకి ఎంట్రీ ఇచ్చాడేమో అని అనిపిస్తోంది. రామ్ చరణ్ చొరవతోనే మోహన్ రాజా ఈ రీమేక్‌ను చేపట్టాడని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











