అంతా ఫెరఫెక్ట్,మీ సహనానికి కృతజ్ఞతలు : అఖిల్

By Srikanya

హైదరాబాద్ : ముందుగా అనుకున్న సమయం కంటే సినిమా విడుదల ఆలస్యం కావడంతో కాస్త ఇబ్బంది పడినా, ప్రేక్షకులకు మాత్రం ఎప్పుడూ తన సినిమా గురించి అప్‌డేట్లు ఇస్తూ.. సినిమా గురించిన చర్చ జనం నోళ్లలో నానేలా చూసుకుంటున్నాడు అఖిల్.

తాజాగా సినిమా పనుల గురించి ట్విట్టర్ ద్వారా తన అభిమానులకు వివరించాడు. అఖిల్ సినిమా పనులన్నీ శరవేగంగా జరుగుతున్నాయని, ప్రతి ఒక్క విషయంలోనూ కచ్చితత్వాన్ని తీసుకొస్తున్నామని తెలిపాడు. అలాగే ప్రేక్షకుల సహనానికి థాంక్స్ కూడా చెప్పాడు. మరిన్ని వివరాలతో త్వరలోనే మళ్లీ మీ ముందుకు వస్తానంటూ ట్వీట్ చేశాడు అక్కినేని బుల్లోడు.

హీరోయిజాన్ని తెరపై ఆవిష్కరించడంలో సిద్దహస్తులు వినాయక్‌. ఆయన వెండితెరపై వడ్డించే విందు భోజనంలో అన్ని రుచులూ ఉంటాయి. కాకపోతే.. మాస్‌ మెచ్చే ఐటెమ్స్‌ ఇంకాస్త ఎక్కువగా కనిపిస్తాయి. ఎందుకంటే ఆయనకు మాస్‌ పల్స్‌ బాగా తెలుసు. అఖిల్‌ కూడా మాస్‌ ఇమేజ్‌నే కోరుకొంటున్నాడు.

ట్రైలర్‌ చూశాంగా.. పాటలు, పోరాటాలూ, నృత్యాలు, సంభాషణలు - వీటన్నింటిలోనూ అదే కనిపిస్తోంది. మరి అఖిల్‌ని తెరపై ఎలా చూపించారో తెలియాలంటే నవంబర్ 11, దీపావళి రోజు వరకూ ఆగాలి. ఎందుకంటే 'అఖిల్‌' సినిమా విడుదలయ్యేది అప్పుడే అంటున్నారు. అక్టోబర్ 29నాటికి ఈ చిత్రం సిజి వర్క్ పూర్తి అవుతుంది.

అఖిల్‌ అక్కినేని హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘అఖిల్' . 'ది పవర్‌ ఆఫ్‌ జువా...' అనేది ట్యాగ్ లైన్. సాయేషా సైగల్‌ హీరోయిన్. వి.వి.వినాయక్‌ దర్శకత్వం వహిస్తున్నారు. నితిన్‌, సుధాకర్‌రెడ్డి నిర్మాతలు. అనూప్‌ రూబెన్స్‌, థమన్‌ సంయుక్తంగా ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు.

Thank you for your patience : Akhil

అగ్నిగోళాన్ని సైతం తన చేతుల్లో ఇముడ్చుకోగల ధీశాలి ఆ కుర్రాడు. భగ భగ మండే సూర్యుడిని తలపించే అతని పయనం ఎక్కడి నుంచి ఎక్కడిదాకా సాగిందో తెలియాలంటే 'అఖిల్‌' చిత్రాన్ని చూడాల్సిందే. నిర్మాతలు మాట్లాడుతూ...''మాస్‌ అంశాలు పుష్కలంగా ఉన్న చిత్రమిది. అఖిల్‌ చేసే యాక్షన్‌ హంగామా చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది''అని చెబుతున్నారు.

అఖిల్‌ అక్కినేని మాట్లాడుతూ ''ప్రేక్షకుల్ని ఎలా సంతృప్తిపరచాలా అని ఎప్పుడూ ఆలోచిస్తుంటా. నా సినిమా పాటల విడుదల వేడుక గురించి ఒక చిన్న మాట చెప్పాలని మహేష్‌ని అడిగా. వేడుకకి నేనే వస్తా అన్నారు. చాలా సంతోషమనిపించింది. సరిగ్గా ఎనిమిది నెలల క్రితం ఒక గొప్ప సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తా అని చెప్పా. ఆ మాట నిజం చేయబోతున్నా. వినాయక్‌గారు ఇదివరకు చేసిన సినిమాలతో పోలిస్తే ఇది పూర్తి భిన్నంగా ఉంటుంది. అనూప్‌, తమన్‌లకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతున్నా. అన్నయ్య, నేను బయట పెద్దగా మాట్లాడుకోం. కానీ నా గురించి వేదికలపై చాలా బాగా చెబుతుంటాడు. ఆ మాటల్ని చాలా ఇష్టపడుతుంటా'' అన్నారు.

Thank you for your patience : Akhil

వి.వి.వినాయక్‌ చెబుతూ ''ఒక సూపర్‌హిట్‌ సినిమా ఇస్తానని నాగార్జునగారికి మాటిచ్చా. ఆ మాటని నిలబెట్టుకోబోతున్నాం. సినిమా తీసినవాడిగా నేను చెబుతున్నా అఖిల్‌ తప్పకుండా సూపర్‌స్టార్‌ అవుతాడు''అన్నారు.

శ్రేష్ఠ్ మూవీస్ బేనర్లో యాక్టర్ నితిన్, ఆయన తండ్రి సుధాకర్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అఖిల్‌ అక్కినేని, సాయేషా సైగల్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్‌, బ్రహ్మానందం, మహేష్‌ మంజ్రేకర్‌, వెన్నెల కిషోర్‌, సప్తగిరితోపాటు మరి కొంతమంది ప్రముఖ నటీనటులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కథ: వెలిగొండ శ్రీనివాస్, మాటలు: కోన వెంకట్, సినిమాటోగ్రఫీ: అమోల్‌రాథోడ్, ఎడిటింగ్: గౌతంరాజు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.వి.వినాయక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X