కుక్కలు అతని సోదరులు, నాకే కృతఙ్ఞతలు: బిగ్ బాస్ కంటెస్టెంట్ వ్యాఖ్యలు

తనని కుక్కలతో పోల్చినన్ సల్మాన్ వ్యాఖ్యల పై బిగ్ బాస్ కంటెస్టెంట్ జుబైర్ మ‌ళ్లీ స్పందించాడు. "స‌ల్మాన్ త‌న సోద‌రులైన శున‌కాల‌కు క్ష‌మాప‌ణ చెప్పుకున్నాడు. అందుకు నాకు కృత‌జ్ఞ‌త‌లు" అంటూ..

ఇంట్లో అస‌భ్య‌ప‌ద‌జాలం వాడి, స‌భ్యుల‌ను బెదిరించిన కార‌ణంగా మొద‌టి వారంలో ఎలిమినేట్ అయిన జుబైర్ ఖాన్, స‌ల్మాన్ ఖాన్ మీద కేసు వేసిన సంగ‌తి తెలిసిందే. దావూద్ కుటుంబీకుడిన‌ని చెప్పుకుంటూ బిగ్‌బాస్‌లో ఎంట్రీ ఇచ్చిన జుబైర్ సోమ‌వారం నాడు త‌న ఫేస్‌బుక్‌లో ఒక వీడియో పోస్ట్ చేశాడు. అందులో బిగ్‌బాస్ కార్య‌క్ర‌మం గురించి, స‌ల్మాన్ ఖాన్ గురించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు.

బిగ్‌బాస్ ఇంట్లో అస‌భ్య ప‌ద‌జాలం

బిగ్‌బాస్ ఇంట్లో అస‌భ్య ప‌ద‌జాలం

తాను ఒక‌టి చెబితే క‌ల‌ర్స్ టీవీ వాళ్లు మ‌రొక‌టి ప్ర‌చారం చేశారని, టీఆర్‌పీల కోసం ప్రోమోల్లో తాను చెప్పిన విష‌యాల‌ను త‌ప్పుగా చూపించార‌ని జుబైర్ అన్నాడు. అలాగే బిగ్‌బాస్ ఇంట్లో అస‌భ్య ప‌ద‌జాలం వాడ‌టంపై కూడా జుబైర్ మాట్లాడాడు. `అర్షి ఖాన్ ఖురాన్‌ను అతిక్ర‌మించింది.

 నా ప‌రువు తీశారు

నా ప‌రువు తీశారు

అర్షి ఖాన్ ఖురాన్‌ను అతిక్ర‌మించింది. శివాని దుర్గ‌తో త‌ప్పుగా ప్ర‌వ‌ర్తించింది. ఇత‌ర స‌భ్యులు తినే ఆహారంలో ఉమ్మి వేసింది. అందుకే ఆమెను తిట్టాను. క‌ల‌ర్స్ వాళ్లు నేను తిట్టింది మాత్ర‌మే చూపించి నా ప‌రువు తీశారు` అన్నాడు. క‌ల‌ర్స్ టీవీ వాళ్లే త‌న దగ్గ‌రికి వ‌చ్చి బిగ్‌బాస్‌లో పాల్గొనాల‌ని కోరార‌ని, వారితో రెండేళ్ల ఒప్పందం ఉంద‌ని, బిగ్‌బాస్ ఇంట్లో నుంచి బ‌య‌టికి వ‌చ్చిన‌ప్ప‌టికీ రెండేళ్ల పాటు క‌ల‌ర్స్ వాళ్లు పారితోషికం ఇస్తార‌ని జుబైర్ వీడియోలో వివ‌రించాడు.

స‌ల్మాన్ క్ష‌మాప‌ణ‌లు

స‌ల్మాన్ క్ష‌మాప‌ణ‌లు

షోలో త‌న‌ని కించ‌ప‌రిచినందుకు స‌ల్మాన్ క్ష‌మాప‌ణ‌లు తెలియ‌జేయాల‌ని కూడా జుబైర్ కోరాడు. ఇక ఈ వివాదం కాస్త పెరగటంతో జుబైర్ కి క్షమాపన చెప్తున్నా అంటూనే సల్మాన్ అతన్ని కుక్కలకన్నా హీనమైన వాడు అంటూ మరింత రెచ్చగొట్టాడు. ‘గతవారం నేను ‘కుక్క' అనే పదం వాడాను.

కుక్కలకి క్షమాపణలు

కుక్కలకి క్షమాపణలు

ఇందుకుగాను ప్రపంచంలోని కుక్కలన్నింటికీ క్షమాపణలు చెబుతున్నాను. అవి ఎంతో నమ్మకంతో పనిచేస్తాయి' అని ప్రముఖ హీరో అన్నాడు. వివరాల్లోకి వెళితే... బిగ్‌బాస్ - 11లో జుబైర్ ఖాన్ వివాదాన్ని మరిపించేందుకు హీరో సల్మాన్ ఖాన్ వీకెండ్ ఎపిసోడ్‌లో మరిన్ని జిమ్మిక్కులు చేశాడు. షో ప్రారంభం కాగానే కుక్కల గురించి ప్రస్తావించి వాటికి క్షమాపణలు చెప్పాడు.

 స‌ల్మాన్ దేవుడేం కాదు

స‌ల్మాన్ దేవుడేం కాదు

దీనిపై జుబైర్ మ‌ళ్లీ స్పందించాడు. `స‌ల్మాన్ త‌న సోద‌రులైన శున‌కాల‌కు క్ష‌మాప‌ణ చెప్పుకున్నాడు. అలా జ‌ర‌గ‌డానికి కార‌ణం నేనే. అందుకు నాకు కృత‌జ్ఞ‌త‌లు తెలపండి. కార్య‌క్ర‌మంలో ఆయ‌న చ‌మ‌త్కారాల‌పై నేను ఇంత‌కంటే ఎక్కువ మాట్ల‌డ‌ను. అయినా స‌ల్మాన్ దేవుడేం కాదు. ఇత‌రుల‌ను కించ‌ప‌ర‌చ‌డానికి` అని అన్నాడు.

ఫోన్ చేస్తే కాల్ కూడా ఎత్త‌డం లేద‌ు

ఫోన్ చేస్తే కాల్ కూడా ఎత్త‌డం లేద‌ు

అంతేకాకుండా తాను దావూద్‌కి ద‌గ్గ‌రి బంధువున‌ని ప్ర‌చారం చేసి, క‌లర్స్ టీవీ, బిగ్‌బాస్ నిర్వాహ‌కులు త‌న‌ను ఇబ్బందుల‌కు గురిచేశార‌ని ఆరోపించాడు. త‌న‌ను టీఆర్పీలు పెంచుకోవ‌డం కోసం వాడుకుని ఇప్పుడు ఫోన్ చేస్తే కాల్ కూడా ఎత్త‌డం లేద‌ని తెలిపాడు. మొత్తానికి ఇంకా ఈ వివాదం ఎంతవరకూ వెళ్తుందో కానీ సల్మాన్ , జుబైర్లిద్దరూ కలిసి బిగ్ బాస్ కి ఇప్పటివరకూ కావాల్సినంత హైప్ తెచ్చేసారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X