మస్కట్లో త్రిష-చార్మి కలిసి ఎంజాయ్ చేస్తూ...(ఫోటోలు)

By Bojja Kumar

హైదరాబాద్: రంభ, ఊర్వశి, మేనక.... మూడు పేర్లను కలగలిపి ముగ్గురు భామల అందాలతో ప్రేక్షకులకు మత్తెక్కించే కాన్సెప్టుతో రూపొందుతున్న సినిమా రమ్(RUM). ఈ సినిమాను నిర్మిస్తున్నది, దర్శకత్వం వహిస్తున్నది ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు. ఈచిత్రంలో రంభగా త్రిష, మేనక పాత్రలో పూర్ణ, ఊర్వశి పాత్రకు నికీషా పటేల్ ఎంపికైంది.

హీరోయిన్ చార్మి ఇందులో ప్రత్యేక పాత్రను పోషిస్తోంది. తాజాగా ఈ చిత్రం షూటింగ్ మస్కట్లో జరుగుతోంది. గతంలో పలు చిత్రాల్లో త్రిషతో కలిసి నటించిన చార్మి ఆమెతో కలిసి షూటింగును బాగా ఎంజాయ్ చేస్తోంది. తాజాగా ఇద్దరు కలిసి మస్కట్లోని ఓ లగ్జరీ హోటల్ కెళ్లి విందు వినోదాల్లో మునిగి తేలారు. అందుకు సంబంధించిన ఫోటోలను తన ట్విట్టర్లో పోస్టు చేసింది చార్మి.

ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, కన్నడలో విడుదల కానుంది. నిర్మాతగా తెరంగ్రేటం చేసిన ఎంఎస్ రాజ ఆ మధ్య వరుస హిట్లు కొట్టి బాగా పాపులరైన సంగతి తెలిసిందే. అయితే అన్ని రోజులు ఒకేలా ఉండవు అన్నట్లు ఈ మధ్య ఈ నిర్మాత వరుస ప్లాపులు చుట్టుముట్టాయి. ఇటీవల తన తనయుడిని హీరోగా పరిచయం చేస్తూ దర్శకత్వంలో వేలు పెట్టి చేయి కాల్చుకున్నారు. మరి ఈ సినిమాలో ఎంఎస్ రాజు పని తీరు ఎలా ఉంటుందో చూడాలి.

మస్కట్లో త్రిష-చార్మి కలిసి ఎంజాయ్ చేస్తూ...(ఫోటోలు)

త్రిషతో కలిసి విందును ఎంజాయ్ చేస్తున్న చార్మి.

మస్కట్లో త్రిష-చార్మి కలిసి ఎంజాయ్ చేస్తూ...(ఫోటోలు)

ఇద్దరు కలిసి మస్కట్లోని ఓ లగ్జరీ హోటల్లో ఓమాని ఫెడ్ టేస్ట్ చేసారు.

మస్కట్లో త్రిష-చార్మి కలిసి ఎంజాయ్ చేస్తూ...(ఫోటోలు)

గతంలో త్రిష, చార్మి ప్రభాస్ హీరోగా రూపొందిన పౌర్ణమి చిత్రంలో కలిసి నటించారు.

మస్కట్లో త్రిష-చార్మి కలిసి ఎంజాయ్ చేస్తూ...(ఫోటోలు)

పౌర్ణమి చిత్రం తర్వాత మళ్లీ ఇద్దరు కలిసి నటించలేదు.

మస్కట్లో త్రిష-చార్మి కలిసి ఎంజాయ్ చేస్తూ...(ఫోటోలు)

తాజాగా మళ్లీ త్రిషతో కలిసి నటించే అవకాశం దక్కడంపై ఆనందంగా ఉంది చార్మి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X