సల్మాన్ ఖాన్ భారీ ఆఫర్.. కానీ ఆ భయంతోనే.. తరుణ్ భాస్కర్

టాలీవుడ్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా పెళ్లిచూపులు సినిమాతో భారీ సక్సెస్‌ను సాధించారు. ఆ తర్వాత నటుడిగా తన మార్కును చూపించే ప్రయత్నం చేశారు. భారీ విజయం తర్వాత తన సినీ ప్రయాణాన్ని లోప్రొఫైల్‌లో కొనసాగిస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో తన అనుభవాలను, సినీ, రాజకీయ విషయాలపై కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తరుణ్ భాస్కర్ తాజాగా ప్రముఖ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..

 పెళ్లి చూపులు సినిమా తర్వాత

పెళ్లి చూపులు సినిమా తర్వాత

పెళ్లి చూపులు సినిమా తర్వాత ఊహించిన విధంగా పాపులారిటీ, డబ్బు వచ్చింది. అలాంటి విషయాలతో నాకు ఓ భయం ఏర్పడింది. అంతేకాకుండా పెళ్లి చూపులు సినిమా సమయంలో మా నాన్న మరణించడంతో కొంత విషాదానికి గురయ్యాం. ఇలాంటి మిశ్రమ సంఘటనల వల్ల బ్యాలెన్స్‌గా ఉండటానికి, నా మీద నాకు కాన్ఫిడెన్స్ రావడానికి చిన్న సినిమాల్లో నటించాను, ఈ నగరానికి ఏమైంది లాంటి చిన్న సినిమాకు దర్శకత్వం వహించాల్సి వచ్చింది అని తరుణ్ భాస్కర్ చెప్పారు

సల్మాన్ ఖాన్ భారీ ఆఫర్

సల్మాన్ ఖాన్ భారీ ఆఫర్

పెళ్లి చూపుల సినిమా తర్వాత నాకు చాలా ఆఫర్లు వచ్చాయి. హిందీలో రీమేక్ చేయమని సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ ఆఫర్ ఇచ్చారు. ముంబైకి వెళ్లి ఆయనతో చర్చలు జరిగాయి. త్వరలోనే స్టార్ హీరోలతో తప్పకుండా చేస్తాను. స్టార్ల ఇమేజ్ నా కథలకు సరిపోతుందా అనే విషయంపై వర్కవుట్ చేస్తున్నాను అని తరుణ్ భాస్కర్ చెప్పారు.

యాక్టింగ్, డైరెక్షన్ అంటే ఇష్టమే..

యాక్టింగ్, డైరెక్షన్ అంటే ఇష్టమే..

నాకు దర్శకత్వం మీదనో, యాక్టింగ్ మీదనో నాకు ప్రత్యేకమైన ఇష్టం లేదు. డైరెక్షన్ చేస్తూనే సినిమాలో అవకాశాలు వస్తే నటిస్తాను. నాకు రెండూ ఇష్టమే. నేను దేనికో ఒక్కదానికి పరిమితం కాను. మంచి అవకాశాలు వస్తే యాక్టింగ్ చేస్తాను. మంచి కథలో సినిమాలకు దర్శకత్వం వహిస్తాను అని తరుణ్ భాస్కర్ చెప్పారు.

నో పాలిటిక్స్ ప్లీజ్.. సినిమానే ప్రపంచం

నో పాలిటిక్స్ ప్లీజ్.. సినిమానే ప్రపంచం

నేను రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి సినిమా పరిశ్రమకు వచ్చాను. అయితే నాకు రాజకీయాలంటే ఇష్టం లేదు. రాజకీయ వారసత్వాన్ని పుచ్చుకోను. సినిమాలే నాకు ప్రపంచం. సమాజంలో ఏదైనా మార్పు తీసుకురావాలంటే నేను సినిమా ద్వారా ఆ ప్రయత్నం చేస్తాను. సినిమాకు బలమైన శక్తి ఉందనే అభిప్రాయాన్ని తరుణ్ భాస్కర్ వ్యక్తం చేశారు.

Recommended Video

Rahul Sipligunj Challenges TRS MLA & Tollywood Stars
తరుణ్ భాస్కర్ కెరీర్ ఇలా..

తరుణ్ భాస్కర్ కెరీర్ ఇలా..

సైన్మా షార్ట్ ఫిలింతో గుర్తింపు పొందిన తరుణ్ భాస్కర్ పెళ్లి చూపులు చిత్రంతో దర్శకుడిగా మారారు. ఆ తర్వాత ఈ నగరానికి ఏమైంది చిత్రానికి దర్శకత్వం వహించారు. అనంతరం మహానటి, సమ్మోహనం, ఫలక్‌నుమా దాస్, మీకు మాత్రమే చెబుతా లాంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. లాక్‌డౌన్ తర్వాత మూడో చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X