Don't Miss!
- Automobiles కారులో ఎక్కువ సౌండ్‌తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- News మండుటెండల్లో నారాయణ విద్యాసంస్థల సిబ్బందికి ఎన్నికల కష్టం!!
- Lifestyle రాత్రిపూట అలర్జీలు పెరుగుతున్నాయా? ఈ నియమాలు పాటిస్తే నిద్ర తేలికగా వస్తుంది
- Sports T20 వరల్డ్ కప్‌కు భారత తుదిజట్టు ఇదే - సెహ్వాగ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
డబ్బులు పోతాయని విజయ్ దేవరకొండకు ముందే చెప్పా.. అయినా పట్టించుకోలేదు: తరుణ్
టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా అభిమానుల్లో ఏ స్థాయిలో క్రేజ్ అందుకున్నాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఒక రౌడి స్టార్ గా యూత్ లో తన బ్రాండ్ ను అమాంతంగా పెంచేసుకున్నాడు. ఇక మధ్య మధ్యలో విజయ్ నిర్మాతగా కూడా అడుగులు వేసే ప్రయత్నం చేస్తున్నాడు. కింగ్ ఆఫ్ ద హిల్ ప్రొడక్షన్ హౌజ్ ను కూడా స్టార్ట్ చేసి తన సినిమాలకు కో ప్రొడ్యూసర్ గా ఉండడమే కాకుండా కొన్ని చిన్న చిన్న సినిమాలను కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాడు.
ఆ హిట్టు సినిమాకు రెమ్యునరేషన్
విజయ్ దేవరకొండ నటుడిగా ఎంత కష్టపడి పైకి వచ్చాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మొదట లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ లో ఒక చిన్న నెగిటివ్ పాత్రలో కనిపించి ఆ తరువాత మెల్లమెల్లగా తన స్థాయిని పెంచుకున్నాడు. అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా యూ టర్న్ తీసుకున్నాడు. ఆ సినిమాకు విజయ్ కు దక్కిన మొదటి రెమ్యునరేషన్ రూ.5లక్షలు మాత్రమే. ఆ తరువాత ప్రాఫిట్స్ లో సెపరేట్ గా షేర్ ఇచ్చారు.
రెమ్యునరేషన్ కోసం టెంప్ట్ అవ్వకుండా
ఇక విజయ్ దేవరకొండ సినిమాలు ఒక్కొక్కటి 50కోట్ల బిజినెస్ కు షిఫ్ట్ అవ్వడంతో రెమ్యునరేషన్ డోస్ కూడా పెరుగుతూ వచ్చింది. ఇక గీత గోవిందం సినిమాతో మెల్లగా తన రెమ్యునరేషన్ డోస్ ను 10కోట్లను దాటించేసిన విజయ్ వీలైనంత వరకు తొందర పడకుండా అభిమానులకు నచ్చే విదంగా కథలను సెలెక్ట్ చేసుకుంటున్నాడు. కొందరు ఎక్కువ ఇస్తామని రెమ్యునరేషన్ ఆశ చూపినా కూడా రొటీన్ కథలను చేయడం లేదు.
ఆ సినిమా మాత్రం..
ఇక విజయ్ దేవరకొండ ప్రొడక్షన్ లోకి అడుగుపెట్టి నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. 'మీకు మాత్రమే చెప్తా' అనే సినిమాను కూడా ప్రొడ్యూస్ చేసి మంచి హైప్ క్రియేట్ చేశాడు. ఎంతో డిఫరెంట్ గా ట్రై చేసి తీసిన ఆ సినిమా ఒక వర్గానికి అయితే బాగానే నచ్చింది. అయితే ఆ సినిమా అనుకున్నంత రేంజ్ లో మాత్రం సక్సెస్ కాలేకపోయింది.
డబ్బులు పోతాయని ముందే చెప్పా
ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో అందులో కథానాయకుడిగా నటించిన దర్శకుడు తరుణ్ భాస్కర్ విజయ్ కు ముందే చెప్పాడట. నన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తే ఎవరు చూస్తారు. నీ డబ్బులు పోతాయి చూస్కో అని ముందే చెప్పాను అంటూ తరుణ్ వివరణ ఇచ్చాడట. విజయ్ కూడా పెద్దగా ఆలోచించకుండా నువ్వు అయితేనే కథకు సెట్టవుతావు అంటూ సినిమా మీద నమ్మకంతో ప్రొడ్యూస్ చేశాడని తరుణ్ భాస్కర్ వివరణ ఇచ్చాడు.