వాళ్ళని హీరోలు అదుపు చేయలేరు.. అందుకే డిప్రెషన్‌కి గురయ్యా.. తరుణ్ భాస్కర్ షాకింగ్ కామెంట్స్

అభిమానం అనే డోస్ రోజురోజుకి హద్దులు దాటిపోతోందని ఈ మధ్య కాలంలో చాలా మంది సినీ తారలు కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇటీవల నెగిటివ్ కామెంట్స్ కి గురైన తరుణ్ భాస్కర్ కూడా అదే తరహాలో రియాక్ట్ అవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఇక ఆయన హీరోలపై కూడా మరోసారి ఉహీంచని విధంగా స్పందించడం హాట్ టాపిక్ గా మారింది.

తరుణ్ భాస్కర్ కామెంట్స్..

తరుణ్ భాస్కర్ కామెంట్స్..

ఇటీవల నెట్ ఫ్లిక్స్ కప్పేలా అనే మళయాళం సినిమాను చూసిన తరుణ్ భాస్కర్ ఆ సినిమాను పొగుడుతూ కమర్షియల్ హీరోలను కాస్త తగ్గించి మాట్లాడారని అభిమానులు సీరియస్ అయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా రైతులు, సైనికులు అనగానే.. ఇటీవల మహేష్ బాబు నటించిన మహర్షి, సరిలేరు నీకెవ్వరు అనే సినిమాలపైనే కామెంట్ చేశాడని ఆ స్టార్ అభిమానులు ఉహించుకున్నారు. దీంతో మహేష్ ఫ్యాన్స్ vs తరుణ్ భాస్కర్ అనేలా ఇటీవల సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో కామెంట్స్ వచ్చాయి.

ట్రోలింగ్ తట్టుకోలేక..

ట్రోలింగ్ తట్టుకోలేక..

ట్రోలింగ్ ఎక్కువవ్వడంతో తరుణ్ భాస్కర్ కూడా ధిటుగానే స్పందించాడు. ఫేక్ ఐడీలతో ట్రోల్ చేసేవారిని నేను పట్టించుకోనని చెప్పాడు. నెగిటివ్ కామెంట్స్ చేసిన వారిపై పోలీసులకు పిర్యాదు చేశారు. అదే విధంగా ఆ విషయంపై మారోసారి స్పందించిన తరుణ్ భాస్కర్ అభిమానుల కారణంగా తీవ్రంగా డిప్రెషన్ కి గురైనట్లు చెప్పారు.

అందుకే హీరోలు పట్టించుకోరు..

అందుకే హీరోలు పట్టించుకోరు..

అలాగే హీరోలు అభిమానులను కంట్రోల్ చేయకపోవడానికి గల కారణాలను కూడా తెలిపాడు. స్టార్ హీరోలకు వారి అభిమానులపై నియంత్రణ లేదు. కొంతమంది హీరోలు అయితే పట్టించుకోరు కూడా.. ఏ విధంగాను స్పందించరు. ఎందుకంటే వారు ఈ గందరగోళంలో పడటానికి ఇష్టపడరు. మన చేతులు మురికి అవ్వడం ఎందుకని ఇంట్రెస్ట్ చూపరని తరుణ్ భాస్కర్ తెలియజేశారు.

Recommended Video

Rahul Sipligunj Challenges TRS MLA & Tollywood Stars
ఇలాంటి కామెంట్స్ అవసరమా?

ఇలాంటి కామెంట్స్ అవసరమా?

పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది వంటి సినిమాలతో తనకంటూ ఒక మంచి క్రేజ్ తెచ్చుకున్న తరుణ్ భాస్కర్ చాలా రోజుల తరువాత కాంట్రవర్సీ వార్తలతో నిలవడంతో ఓ వర్గం నెటీజన్స్ షాక్ కి గురయ్యారు. అదే విధంగా హీరోలను కించపరిచేలా కామెంట్స్ చేసి అభిమానులను హార్ట్ చేయడం ఎందుకు అనే ప్రశ్నలు కూడా ఎదురవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X