twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రివ్యూ రేటింగ్ తక్కువ ఇచ్చారని కాదు, ఆ మాట వల్లే మండింది: తరుణ్ భాస్కర్

    By Bojja Kumar
    |

    Recommended Video

    Tharun Bhascker Gives Clarification On His Posts

    'పెళ్లి చూపులు' ఫేం తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో కొత్త నటీనటులతో తెరకెక్కిన చిత్రం 'ఈ నగరానికి ఏమైంది?'. సురేష్ ప్రొడక్షన్స్ లాంటి పెద్ద సంస్థ ఈచిత్రాన్ని నిర్మించడం, తరుణ్ భాస్కర్ గత సినిమా మంచి హిట్ కావడంతో 'ఈ నగరానికి ఏమైంది?'పై ముందు నుండి మంచి అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా విడుదలైన తర్వాత రెస్పాన్స్ కూడా సంతృప్తి కరంగానే ఉంది. అయితే ఈ సినిమాకు వచ్చిన కొన్ని రివ్యూలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో తరుణ్ భాస్కర్ పోట్టిన పోస్ట్ వివాదాస్పదం అయింది. ఈ నేపథ్యంలో తాజాగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్లో తరుణ్ భాస్కర్ వివరణ ఇచ్చారు.

    ముందు నుండి ఆ భయం ఉంది

    ముందు నుండి ఆ భయం ఉంది

    ప్రేక్షకుల నుండి మా సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమా చాలా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. కొత్తవాళ్లతో సినిమా చేసినపుడు ఏదైనా తేడా వస్తుందేమో? ఓపెనింగ్స్ ఉంటాయా? ఉండవా? అనే భయం ఉండేది. కానీ థియేటర్లో రెస్పాన్స్ చూసినపుడు చాలా సంతోషం అనిపించింది. మా కష్టానికి తగిన ప్రతిపలం దక్కింది అనిపించింది. రిపీటెడ్ ఆడియన్స్ వస్తున్నారు. సినిమాలోని ప్రతి క్యారెక్టర్ కు రిలేట్ అవుతున్నారు... అని తరుణ్ భాస్కర్ తెలిపారు.

    పెళ్లి చూపులుతో పోల్చొద్దు

    పెళ్లి చూపులుతో పోల్చొద్దు

    కొందరు పెళ్లి చూపులు లాగా ఉందా? అనే సందేహంలో ఉన్నారు. కానీ ఇది పెళ్లి చూపులు కంటే డిఫరెంట్ ఫిల్మ్. దానికి దీనికి ఎక్కడా కంపారిజన్ లేదు. సినిమాలో ఎక్కడా వల్గారిటీ లేదు. ఆల్కహాల్ గురించి కొన్ని సీన్లు ఉన్నా కానీ ఈ జనరేషన్ గురించి చెప్పే సీన్లు అవి. సినిమా చూసిన తర్వాత ఈ తరం మనుషుల గురించి మీరు ఆలోచిస్తారు. అదే విధంగా మీ పాత జ్ఞాపకాలు మీకు గుర్తుకు వస్తాయని నమ్ముతున్నాను... అన్ని తరుణ్ వ్యాఖ్యానించారు.

    రివ్యూలను గౌరవిస్తాను

    రివ్యూలను గౌరవిస్తాను

    రివ్యూల గురించి నేను చేసిన కామెంట్లపై బయట విమర్శలు వస్తున్నాయి. కానీ రివ్యూలను ఎప్పుడూ గౌరవిస్తాను. ఆ రివ్యూల నుండే ‘పెళ్లి చూపులు' మూవీకి సక్సెస్ వచ్చింది. ‘ఈ నగరానికి ఏమైంది?' చిత్రానికి కూడా చాలా మంచి రివ్యూలు వచ్చాయి. కొందరు 2 స్టార్ రేటింగ్ ఇచ్చినా పెద్దగా బాధపడేలేదు. నేను అందరి అభిప్రాయాలను గౌరవిస్తాను. రివ్యూలు చూసే నేను ప్రతిసారి నన్ను నేను మరింత బెటర్ గా మార్చుకుంటాను.

    ఆ కామెంట్ చేయడం వల్లే మండింది

    ఆ కామెంట్ చేయడం వల్లే మండింది

    మొన్న సోషల్ మీడియాలో రివ్యూలను ఉద్దేశించి ఆ కామెంట్ చేయడానికి కారణం.... కొందరు తమ రివ్యూల్లో కెమెరా ఇక్కడ పెట్టాలి, లైటింగ్ అక్కడ పెట్టాలి అని రాసినపుడు మా అందరికీ మండిపోయి అలాంటి పోస్ట్ పెట్టాల్సి వచ్చింది. సోషల్ మీడియాలో ఏ చిన్న మాట మాట్లాడినా అది పెద్దగా అవుతుంది. నాకు మీ అందరి సపోర్ట్ అవసరం, మీ రివ్యూలు చాలా ముఖ్యం. ప్రతి ఒక్క రివ్యూను గౌరవిస్తాను. అందులో ఎలాంటి సందేహం లేదు... అని తరుణ్ భాస్కర్ తెలిపారు.

    English summary
    Tharun Bhascker speech at Ee Nagaraniki Emaindi success meet. 'Ee Nagaraniki Emaindi buddy comedy written and directed by Tharun Bhascker Dhaassyam, a National Award winner and produced by Suresh Babu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X