నాలుగేళ్లుగా చర్చలు.. మొత్తానికి యువ దర్శకుడికి వెంకటేష్ గ్రీన్ సిగ్నల్
టాలీవుడ్ విక్టరీ వెంకటేష్ చాలా రోజుల తరువాత నెక్స్ట్ సినిమాలకు చాలా ఫాస్ట్ గా సెట్స్ పైకి తెస్తున్నాడు. అందరిలనే మరో మూడేళ్లకు సరిపీయేలా కథలను కూడా రెడీ చేసుకుంటున్నాడు. ఇక నెక్స్ట్ నారప్ప సినిమాతో రానున్న వెంకీ ఆ తరువాత F3 సినిమాతో రానున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి
F3 లాంటి కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్ తరువాత వెంకటేష్ ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడు అనేది ఇంకా ఫైనల్ కాలేదు. వీలైనంత వరకు స్లోగానే వెళ్లాలని అనుకుంటున్న వెంకటేష్ F3 పనులు సగం అయిపోతే ఒక స్పెషల్ ఎనౌన్స్మెంట్ ఇవ్వాలని అనుకుంటున్నాడట. సురేష్ బాబు ప్రొడక్షన్ లోనే మరో సినిమా రానుందట. పెళ్లి చూపులు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తో మూవీకి కమిటైన విషయం తెలిసిందే. ఈ కాంబోపై గత నాలుగేళ్లుగా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి.

అయితే డైరెక్టర్ ఇంకా స్క్రిప్ట్ పనులను పూర్తి చేయలేదని టాక్ వచ్చింది. ముందుగా వీరి కాంబినేషన్ లో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమా వస్తుందని టాక్ వచ్చింది. అయితే స్క్రిప్ట్ లో అనుమానాలు ఉండడం వల్లే వెనక్కి తగ్గినట్లు దర్శకుడు కూడా చెప్పాడు. ఇక ఫైనల్ గా దర్శకుడు మరో కొత్త కథకు ఫీనిషింగ్ టచ్ ఇస్తున్నట్లు సమాచారం. ఇటీవల వెంకీతో చర్చలు జరిపిన తరుణ్ మొత్తానికి ఫుల్ గా గ్రీన్ సిగ్నల్ అందుకున్నట్లు సమాచారం. సురేష్ బాబు కూడా బడ్జెట్ విషయంలో ఏ మాత్రం లిమిట్స్ లేకుండా ప్లాన్ చేసుకోమ్మని వివరణ ఇచ్చారట. మరి సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











