ఆ డైరెక్టర్లు చేసిన పనులన్నీ బయట పెడతా.. ఎవ్వరినీ వదిలి పెట్టను: తరుణ్ భాస్కర్ సెన్సేషన్

By Manoj

తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న టాలెంటెడ్ డైరెక్టర్లలో యంగ్ సెన్సేషన్ తరుణ్ భాస్కర్ ఒకడు. కెరీర్ ఆరంభంలో కొన్ని షార్ట్ ఫిల్మ్‌లు తీసి మెప్పించిన అతడు.. 'పెళ్లి చూపులు' అనే సినిమాతో సినీ రంగానికి పరిచయం అయ్యాడు. విజయ్ దేవరకొండ, రితూ వర్మ జంటగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో పాటు జాతీయ అవార్డులు సహా ఎన్నో పురస్కారాలను అందుకుంది. ఫలితంగా తరుణ్ బాగా బిజీ అయిపోయాడు. ఈ క్రమంలో అతడు మిగిలిన డైరెక్టర్ల రహస్యాలు బయట పెట్టే పనిలో పడ్డాడు. ఆ వివరాలేంటో చూద్దాం.!

మరో యాంగిల్ కూడా చూపించిన తరుణ్

మరో యాంగిల్ కూడా చూపించిన తరుణ్

‘పెళ్లి చూపులు'తో దర్శకుడిగా పరిచయమైన తరుణ్ భాస్కర్.. ఆ సినిమాకు పని చేసిన విధానంతో బాగా పాపులర్ అయిపోయాడు. దానితో పాటు ‘ఈ నగరానికి ఏమైంది' అనే సినిమానూ తెరకెక్కించాడు. అదే సమయంలో అతడు తనలోని మరో యాంగిల్ చూపించాడు. ఇందులో భాగంగానే ‘మీకు మాత్రమే చెప్తా'తో హీరోగా ఎంట్రీ ఇవ్వడంతో పాటు పలు మూవీల్లో నటించాడు.

బడా హీరోతో సినిమా.. లైన్‌లో పెట్టేశాడు

బడా హీరోతో సినిమా.. లైన్‌లో పెట్టేశాడు

ప్రస్తుతం దర్శకుడిగా, హీరోగా, సపోర్టింగ్ యాక్టర్‌గా బిజీ బిజీగా గడుపుతున్నాడు యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్. ఈ క్రమంలోనే అతడు మరో సినిమాను లైన్‌లో పెట్టేశాడు. ఇందులో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ నటించబోతున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతుంది. ఈ విషయాన్ని తరుణ్ కూడా ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే.

తరుణ్ భాస్కర్‌ను తెగ తిట్టేస్తున్న తల్లి

ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటోన్న సమయంలో తరుణ్ భాస్కర్ సరికొత్త ప్రయోగంతో ముందుకు వస్తున్నాడు. ఇప్పటి వరకు తనలోని ఎన్నో యాంగిల్స్ చూపించిన అతడు.. త్వరలోనే ప్రముఖ చానెల్‌లో ప్రసారం కాబోతున్న ఓ షోకు హోస్ట్‌గా కనిపించబోతున్నాడు. ఈ మేరకు యూట్యూబ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. అందులో తరుణ్‌ను, అతడి తల్లి తిట్టడం చూపించారు.

ఆ డైరెక్టర్లు చేసిన పనులన్నీ బయట పెడతా

తాజాగా ఈ షోకు సంబంధించిన ఓ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా తరుణ్ భాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘ఇప్పటి వరకు సినిమా రంగంలో పని చేశా. ఇకపై బుల్లితెరపైనా కనిపించబోతున్నా. ఈ షో వల్ల ఎంతో మంది దర్శకులపై అభిప్రాయం మారిపోయింది. వాళ్ల గురించి తెలియని విషయాలు మీకు వివరించబోతున్నా' అని చెప్పుకొచ్చాడు.

Recommended Video

Meeku Mathrame Cheptha Teaser
ఎవ్వరినీ వదిలను.. ఇప్పటికే వాళ్లంతా అయిపోయారు

ఎవ్వరినీ వదిలను.. ఇప్పటికే వాళ్లంతా అయిపోయారు

సినిమాల్లోకి రాకముందు.. వచ్చిన తర్వాత జరిగిన అంశాలను తెలిపే కార్యక్రమమే ‘నేను మీకు చెప్తా'. ఈ షోకు హోస్ట్‌‌గా వ్యవహరిస్తున్న తరుణ్ భాస్కర్.. మిగిలిన దర్శకులను ఇంటర్వ్యూ చేయబోతున్నాడు. ఈ క్రమంలోనే షో గురించి చెబుతూ.. ‘ఇప్పటికే చాలా మంది ఇంటర్వ్యూల ఎపిసోడ్స్ షూట్ చేశాం. మిగిలిన వాళ్లను కూడా వదిలిపెట్టం' అని వెల్లడించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X