రకుల్ ప్రీత్ సింగ్ చాలా లక్కీ: మహేష్ బాబుతో ఫస్ట్ డేట్ ఆ రోజే...

By Bojja Kumar

హైదరాబాద్: మహేష్ బాబు, మురగదాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ సెలక్టయ్యే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే పాఠకులకు తెలియజేసాం. తాజాగా ఈ విషయం ఖరారైంది. ఆగస్టు 11న రకుల్ ప్రీత్ సింగ్ ఈ చిత్ర షూటింగులో జాయిన్ కాబోతోంది. ఆగస్టు 11 మహేష్ బాబు లాంటి పెద్ద స్టార్ తో రకుల్ గడపబోతున్న ఫస్ట్ డేట్ అన్నేమాట.

వాస్తవానికి దర్శకుడు మురగదాస్ ఈ చిత్రంలో హీరోయిన్ గా పరిణీతి చోప్రాను అనుకున్నారు. పరిణీతి చోప్రా కూడా మహేష్ బాబు, మురగదాస్ లాంటి వారితో పని చేయాలని చాలా కాలంగా ఎదురు చూస్తోంది. అయితే పరిణీతి ఇప్పటికే కొన్ని సినిమాలు కమిట్ కావడం, డేట్స్ అడ్జెస్ట్ చేయలక ఈ ప్రాజెక్టు నుండి తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో రకుల్ ప్రీత్ సింగ్ ను ఈ అవకాశం వరించింది.

That Day Would Be Rakul Preet's First Date With Mahesh Babu

'జులై 29 నుండి ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలు కాబోతోంది. ఈ నేపథ్యంలో రకుల్ ప్రీత్ సింగ్ నే హీరోయిన్ గా ఫిక్స్ చేసారు' అని ఫిల్మ్ నగర్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. వాస్తవానికి రకుల్ ప్రీత్ సింగ్ 'బ్రహ్మోత్సవం' సినిమాలోనే మహేష్ బాబుతో చేయాల్సి ఉంది. అయితే ఆ సమయంలో ఆమె నాన్నకు ప్రేమతో సినిమా షూటింగులో ఆమె ఉండటంతో ఆ సినిమాలో చేయలేక పోయింది.

ఒక రకంగా రకుల్ ఆ సనిమాలో చేయక పోవడం మంచిదే అయింది. ఇపుడు మహేష్ బాబు, మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్టులో ఆమె అవకాశం దక్కించుకోవడం రకుల్ అదృష్టమనే చెప్పకతప్పదు. ఈ సినిమాతో పాటు రకుల్ ప్రీత్ సింగ్ రామ్ చరణ్ ద్రువ, సాయి ధరమ్ తేజ్ తర్వాతి సినిమాతో పాటు బోయాపాటి దర్శకత్వంలో రాబోతున్న సినిమా, మరో తమిళ సినిమాలో నటిస్తోంది.

వరుస ప్రాజెక్టులకు కమిట్ కావడంతో కొన్ని రోజుల వరకు రకుల్ తీరిక లేకుండా బాగా కష్టపడక తప్పదు. గుడ్ లక్ రకుల్...

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X