ఆ.. ఫోన్ కాల్ త్రిష జీవితాన్ని మార్చేసింది
ఆ ఫోన్ కాల్ రాకుంటే నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉండేదాన్ని కాదు, ఇంత మంది అభిమానులు, ఇన్ని సినిమాల్లో నటించేదాన్నే కాదు అంటోంది త్రిష. త్రిష తన కెరియర్ మొదట్టో 'లెసా లెసా" అనే తమిళ చిత్రంలో నటించింది. ఆ సినిమా ఘోరమైన ప్లాపయింది కూడా. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ.... ''ఆ సినిమా ప్లాపవ్వడంతో నాకు చాలా బాధే సింది, అప్పటి వరకు స్కూల్లో, కాలేజీలో, మోడలింగ్ లో ఓటమి అంటే ఏమిటో ఎరుగని తనను ఆ సినిమా చాలా కృంగదీసింది. సినిమా ఫీల్డ్ నుంచి బయట పడాలని నిర్ణయించుకున్నా.
ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత మనసు ప్రశాతంగా అనిపించింది. ఆరోజు రాత్రి హాయిగా నిద్రపోయా. మరునాడు ఉదయం నాకు చాలా ఫోన్ కాల్స్ వచ్చాయి. పది సినిమాలు చేసిన హీరోయిన్లా చాలా బాగా నటించావు, నీకు మంచి భవిష్యత్ ఉంది అని అంతా పొగిడేసారు. ఆ ఫోన్ కాల్స్ తో మళ్లీ నాకు సినిమాల్లో రాణించాలనే పట్టుదల పెరిగింది. సినిమా ఫెయియింది కానీ, నటిగా ఫెయిల్ కాలేదని అర్థమైంది. అప్పటి నుంచి వరుస సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకున్నాను, ప్రస్తుతం నా కెరీర్ సంతప్తిగా సాగుతోంది"" అని చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం త్రిష ఎన్టీఆర్ సరస దమ్ము సినిమాలో, విశాల్ హీరోగా తెలుగు, తమిళం, హిందీలో రూపొందుతున్న సమరన్ అనే సినిమాలో నటిస్తోంది. త్రిష ప్రస్తుతం చేస్తున్న సినిమాలతో కలిపితే ఆమె ఇప్పటి వరకు చేసిన సినిమాలు 44. మరో ఆరు సినిమాలు చేస్తే అమ్మడు హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంటుంది.


Click it and Unblock the Notifications











