twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మెగాస్టార్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు...!

    By Sindhu
    |

    చిరంజీవి నటించే 150 వ సినిమా ఎప్పుడు మొదలవుతుంది? అసలు ఆయన ఆ సినిమా చేస్తున్నారా? లేదా? అభిమానులందరిలోనూ ఇదే అనుమానం... ఇదే క్యూరియాజిటీ. అందరూ ఆయనని ఇదే అడుగుతున్నారు. మొన్న శనివారం డిల్లీలో కేంద్ర మంత్రి జైరాం రమేష్ కూడా చిరంజీవిని ఇదే ప్రశ్న అడిగారట. మరి, చిరంజీవి ఈ సినిమా గురించి ఏం చెబుతున్నారు? 'నిజమే, అందరూ ఈ సినిమా గురించే అడుగుతున్నారు. చెబుతున్నారు?సినిమాల్లో రీఎంట్రీ ఇస్తున్నా అంటూ ఆ మధ్య ఓ సందర్భంలో చిరంజీవి ప్రకటించారు. 'అన్నయ్యతో సినిమా తీస్తున్నా" అని దర్శకుడు పూరి జగన్నాథ్ కూడ ప్రకటించేశాడు. ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు సెంట్స్ మీదకు వచ్చే అవకాశాలున్నాయని టాలీవుడ్ లో చర్చ జరుగుతోంది.

    అయితే పూరి జగన్నాథ్ డైరీ అంత ఖాళీగా లేదు. ప్రస్తుతం మహేస్ తో 'ది బిజినెస్ మ్యాన్" సినిమా చేయనున్న పూరి, ఆ తర్వాత ఎన్టీఆర్ తో ఓ సినిమా తీస్గాడు. రవితేజతో 'ఇడియట్ 2" కూడా చేపట్టాల్సి వుంది..ఇవన్నీ లెక్కపెట్టుకొంటే పూరితో చిరంజీవి సినిమా చేయడం దాదాపు డౌటే. మరి వినాయక్ సంగతేంటి? అన్నయ్యతో సినిమా చేస్తానంటూ వినాయక్ కూడా చాన్నాళ్ళుగా చెబుతూ వస్తున్నాడు. మరి వినాయక్ ని పిలిచి చిరంజీవికి ఛాన్సిస్తాడా..?పూరిని ఒప్పిస్తాడా? ఇవేవీ కదాని, రాజకీయాలకే పరిమితైపోతాడా? అన్న విషయం చిరంజీవి దగ్గర ప్రస్తావించగా...

    అయితే, ఇంకా ఇది కన్ఫర్మ్ కాలేదనే చెప్పాలి. సామాజిక స్పృహ వున్న సినిమా చేయాలని ఆలోచిస్తున్నాం. అందుకు తగ్గా బలమైన కథ, దానిని చక్కగా మలచగలిగే దర్శకుడు... అన్నీ కుదరాలి. దాని కోసమే ట్రై చేస్తున్నాం. సందేశంతో బాటు వినోదం కూడా వుండే కథ దొరకాలి. ఇంద్ర, ఠాగూర్, స్టాలిన్ సినిమాల స్థాయిలో పవర్ ఫుల్ సబ్జెక్ట్ కావాలి" అంటున్నారు చిరంజీవి. తన 150 వ సినిమాలో తనయుడు రామ్ చరణ్ కూడా నటించే అవకాశం ఉందన్నారు. అన్నట్టు... ఈ రోజు చిరంజీవి తన 56 వ జన్మ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు

    కొణిదెల శివశంకర వరప్రసాద్ 'పునాదిరాళ్ళు"తో చలనచిత్ర రంగప్రవేశం చేశాడు. 'ఖైదీ"తో అందరి మనసు దోచాడు.పసివాడి"ప్రాణం"గా పిల్లల ను అలరించాడు ."స్వయంకృషి" తో 'రుద్రవీణ" కు జాతీయ అవార్డు సాధించాడు."మరణమృదంగం" తో మెగాస్టార్ అయ్యాడు.ఈ 'జగదేకవీరుడు" అతిలోకసుందరి తో రాసలీల లాడి,"గ్యాంగ్ లీడరై ' 'రౌడీఅల్లుడు" & 'ఘరానామొగుడు" గా అందరికీ 'ఆపద్భాంధవుడై"నాడు. 'ఇంద్ర"సేనుడి గా విజయఢంకా మ్రోగిస్తూ 'ఠాగూర్" గా చరిత్ర సృష్టించాడు."శంకర్ దాదా MBBS"అంటూ ఆప్యాయత పంచి 'అందరివాడు" గా నిలిచాడు ఈ 'జై చిరంజీవ. సినిమాలోకంలోనుండి రాజ‌కీయాల్లోకి వెళ్ళి అక్కడ కూడా త‌న‌దైన పంథాలో ముందుకు ప‌య‌నిస్తూ ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి, కాంగ్రెస్ నేత‌గా, రాష్ట్ర్ర రాజ‌కీయాల‌లో ఒక బ‌ల‌మైన నాయ‌కుడిగా ఎద‌గ‌డానికి ముందుకు సాగుతున్న మెగాస్టార్‌, ప‌ద్మభూష‌ణ్‌, డాక్ట్ చిరంజీవి గారికి దట్స్ తెలుగు తరపున పుట్టిన రోజు శుభాకాంక్షలు.

    English summary
    He was once the emperor of Tollywood and though he is no longer into films, he is still called the megastar of Telugu film industry. He is none other than Chiranjeevi and today he is celebrating his birthday. Mega star turned politician Chiranjeevi celebrates his 56th birthday on August 22!
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X