twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అందుకే రాజకీయాలకు దూరం, ఈ దరిద్రాలెందుకు? పవన్ కళ్యాణ్ తేడా జీన్స్: బండ్ల గణేష్

    |

    Recommended Video

    Bandula Ganesh Sensational Comments On His Political Career || Filmibeat Telugu

    తాను రాజకీయాలకు పర్మినెంటుగా దూరం అవుతున్నానని నిర్మాత బండ్ల గణేష్ స్పష్టం స్పష్టం చేశారు. ప్రముఖ తెలుగు టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయాల మీద ఆసక్తి పోయింది, చేయలేను అనే భయం ఏర్పడింది, ఇందులోకి రావడం తొందరపాటు నిర్ణయం అనిపించిందని తెలిపారు.

    రాజకీయాల్లోకి వచ్చి జీవితంలో పెద్ద తప్పు చేశాను. ఇందులో కంటిన్యూ అయితే అడ్రస్ గల్లంతు అవుతుందని అర్థమైంది. ఇవి నాకు సరిపడవు, చేయలేను, నాకు ఆ సమర్దత లేదు అని రియలైజ్ అయ్యాకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు గణేష్ తెలిపారు.

    ఈ దరిద్రాలన్నీ నాకెందుకు అనిపించింది

    ఈ దరిద్రాలన్నీ నాకెందుకు అనిపించింది

    రాజకీయాల్లో ఉంటే అన్నీ అబద్దాలే చెప్పాలి, శత్రువులను బ్లాక్‌లో కొనుక్కోవాలి, ఈ దరిద్రాలన్నీ నాకెందుకు అనిపించింది. నాకు కావాల్సిన వారు అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నారు. రాజకీయాలు వేరు, స్నేహాలు వేరు అని కొందరు అంటుంటారు. వాటిని అలా హ్యాండిల్ చేయడం నా వల్ల కావడం లేదని బండ్ల గణేష్ తెలిపారు.

    ఇక్కడ నటించాలి, అబద్దాలు చెప్పాలి

    ఇక్కడ నటించాలి, అబద్దాలు చెప్పాలి

    మామూలు మనుషులైతే రాజకీయాలు చేయలేరు. ఇక్కడ నటించాలి, అబద్దలు చెప్పాలి. ఒక వ్యక్తి మనకు తెలియక పోయినా ప్రత్యర్థి పార్టీలో ఉన్నాడు కాబట్టి శత్రువులా చూడాలి. రాజకీయాలు అంటే ప్రజలకు సేవ చేయడం అనుకున్నాను. ప్రజలకే కాదు... నా సేవ కూడా నేను చేసుకోలేక పోయాను అని తెలిపారు.

    గొంతుకోసుకుంటాను అని ఏదో అవగాహన లేక మాట్లాడా

    గొంతుకోసుకుంటాను అని ఏదో అవగాహన లేక మాట్లాడా

    తెలంగాణ ఎన్నికల సమయంలో గొంతుకోసుకుంటాను అని ఏదో అవగాహన లేక మాట్లాడాను. దరిద్రం నా నెత్తిన ఉండి నోటికొచచ్చినట్లు మాట్లాడాను. దయచేసి ఆ పాత విషయాన్ని మళ్లీ తీయవద్దు అని బండ్ల గణేష్ రిక్వెస్ట్ చేశారు.

    పవన్ కళ్యాణ్ సీఎం కాకూడదని రాజ్యాంగంలో రాసి ఉందా?

    పవన్ కళ్యాణ్ సీఎం కాకూడదని రాజ్యాంగంలో రాసి ఉందా?

    రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా, పవన్ కళ్యాణ్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిదా చూడాలనే కోరిక నా మనసులో ఉందని గణేష్ తెలిపారు. ఇవి రెండు జరిగేవేనా? అనే ప్రశ్నకు బండ్ల గణేష్ బదులిస్తూ.... ఎందుకు జరుగకూడదు? పవన్ కళ్యాణ్ సీఎం కాకూడదని రాజ్యాంగంలో రాసి ఉందా? ఎక్కడ ఏమైనా జరుగవచ్చు. ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్ ప్రధాని కాలేదా? అని ప్రశ్నించారు.

    అక్కడ టాలెంట్ ఉంటే ఎవరూ ఆపలేరు

    అక్కడ టాలెంట్ ఉంటే ఎవరూ ఆపలేరు

    సినిమా ఇండస్ట్రీని, పొలిటికల్ వ్యవస్థను కంపేర్ చేయమంటే ఎలా చేస్తారు?... సినిమా ఇండస్ట్రీ అమ్మ లాంటిది, గోమాత... కానీ రాజకీయాలు అలా కాదు. నాలాంటోడు కష్టం. సినిమా ఇండస్ట్రీలో టాలెంట్ ఉంటే ఎవరూ ఆపలేరు. టాలెంట్ లేకుంటే రుద్దబడదు. కానీ రాజకీయాల్లో టాలెంట్ లేకున్నా రుద్దబడుతుందని గణేష్ స్పస్టం చేశారు.

    చిరంజీవి మంచి పని చేశారు

    చిరంజీవి మంచి పని చేశారు

    చిరంజీవిగారు పార్టీని విలీనం చేసినపుడు ఇలా చేస్తున్నారేంటి అనిపించింది. కానీ ఇపుడు ఆయన అలా ఎందుకు చేశాడో అర్థమైంది. ఆయన కొందరి వాడిలా కాకుండా అందరి వాడిలా ఉండాలనే ఆ మంచి పని చేశారు. ఆయన చాలా గొప్ప వ్యక్తిత్వ విలువలు కలిగిన వ్యక్తి కాబట్టే అలా చేశారని గణేష్ అభిప్రాయ పడ్డారు.

    పవన్ కళ్యాణ్ తేడా జీన్స్

    పవన్ కళ్యాణ్ తేడా జీన్స్

    చిరంజీవిగారు ఎవరెస్ట్ శిఖరం... నేను రాజకీయాలు మానేశానని ఆయనతో నన్ను కంపేర్ చేయవద్దు. ఆయన ఒక లెజెండ్. ఆయన రాజకీయాలకు దూరం కావడం 200 శాతం కరెక్ట్. పవన్ కళ్యాణ్ గారికి మాత్రం రాజకీయాల నుంచి తప్పుకోవాలనే సలహా ఇవ్వలేను. ఆయన వ్యక్తిత్వం వేరు. ఆయనవి తేడా జీన్స్.. వేరే రేంజిలో ఉంటారు కాబట్టి రాజకీయాలకు ఆయన సమర్దుడని బండ్ల గణేష్ తెలిపారు.

    English summary
    "I do not like to make enemies, That's why quit politics." Bandla Ganesh said. In an interview with a programme of Encounter with Murali Krishna, the filmmaker admitted that he took the wrong decision to join into the politics.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X