#మీటూలో అందుకే నా పేరు లేదు, పవిత్రుడిని అని చెప్పినోళ్లే దొరికారు: వర్మ
ధనుంజయ్, ఇర్రా మోర్ హీరో హీరోయిన్లుగా రామ్ గోపాల్ వర్మ సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ పతాకంపై సిద్ధార్థ తాతోలు దర్శకత్వంలో అభిషేక్ నామ, భాస్కర్ రాశి నిర్మిస్తోన్న చిత్రం భైరవగీత. నవంబర్ 30న సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో వర్మ మీడియాతో ముచ్చటించారు.
ఈ సందర్భంగా భైరవగీత విషయాలతో పాటు ఇతర అంశాలపై సైతం ఆయనకు మీడియా ప్రతి నిధుల నుంచి ప్రశ్నలు ఎదురయ్యాయి. దీనికి ఆర్జీవీ తనదైన శైలిలో ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. ముఖ్యంగా #మీటూ అంశంలో వర్మ స్పందించిన తీరు నవ్వులు పూయించింది.

మీటూలో నేను ఒక్కడినే లేను, అంతా షాకయ్యారు
మీటూ పై మీ అభిప్రాయం ఏమిటి? అనే ప్రశ్నకు వర్మ స్పందిస్తూ... అందులో నేను ఒక్కడినే లేను. నా మీద గతంలో చాలా వార్తలు వచ్చాయి. కానీ మీటూలో నేను తప్ప అందరూ ఉన్నారు. నా పేరు లేక పోవడం చూసి బాలీవుడ్లో చాలా మంది షాకయ్యారని తెలిపారు.

మిమ్మల్ని లవ్ చేశారేమో..?
మీతో కమిటైన వారంతా మిమ్మల్ని లవ్ చేసి ఉంటారు. అందుకే మీ పేరు మీటూలో చెప్పలేదోమో? అంటూ ఓ విలేఖరి సందేహం వ్యక్తం చేయగా... మీకు అలాంటి సందేహం వచ్చినందుకు ‘థాంక్స్' అంటూ వర్మ ఫన్నీ రిప్లై ఇచ్చారు.

అందుకే మీటూలో నా పేరు లేదు
నా పేరు మీటూలో లేక పోవడానికి కారణం నేను ఏ విషయం అయినా ఓపెన్ గా చెబుతాను. నేను చాలా పవిత్రుడిని అని చెప్పినోళ్లు దొరుకుతారు, కానీ నేను ఉదయం లేస్తే థైస్(తొడలు) గురించి మాట్లాడతాను, లేక పోతే జీఎస్టీ లాంటి సినిమా తీస్తాను. నాకు మీటూ ఏముంటుంది? అని వర్మ తెలిపారు.

మేల్ మీటూ గురించి?
మేల్ మీటూ అని కొత్తగా ఒకటి మొదలైంది. మీరు అందులో చేరే అవకాశం ఉందా? అనే ప్రశ్నకు వర్మ రిప్లై ఇవ్వకుండా.... ఒక నవ్వు నవ్వేసి ఊరుకున్నారు.

త్వరలో అతడితో కలిసి సినిమా చేస్తా
మీ శిష్యుడిగా పరిచయమైన అజయ్ భూపతి పెద్ద హిట్ కొట్టాడు. మీ బేనర్లో మీ నేమ్‌తో సినిమా చేయాలని ఆశ పడుతున్నారు. ఆయతో సినిమా చేసే ఆలోచన ఏమైనా ఉందా? అనే ప్రశ్నకు వర్మ స్పందిస్తూ... త్వరలో నేను తను కలిసి సినిమా ప్రొడ్యూస్ చేద్దామనుకుంటున్నామని తెలిపారు.


Click it and Unblock the Notifications











