twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అందుకే పెళ్ళి చేసుకోలేదు..!: జెడి చక్రవర్తి

    By Sindhu
    |

    కథానాయకుల్లో జెడి చక్రవర్తి స్టైలే వేరు. ఏ విషయాన్నైనా నిర్మొహమాటంగా, ముక్కుసూటిగా చెప్పడం ఆయన ప్రత్యేకత. ఆయన ప్రతి మాటలో వ్యంగ్యం, సునిశితమైన హాస్యం తొంగిచూస్తాయి. చాలా కాలం విరామం తర్వాత జెడి చక్రవర్తి నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం 'మనీ మనీ మోర్ మనీ". 'మనీ, మనీ మనీ" చిత్రాలకు సీక్వెల్‌ గా వస్తున్న ఈ చిత్రం ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ఓ సందర్భంలో పెళ్ళి ప్రస్థావన రాగా ఇలా స్పందించారు.

    చాలా మంది పెళ్లెందుకు చేసుకోలేదని అడుగుతుంటారు. అంతే కాదు లవ్ ఫెయిల్యూరా అని ప్రశ్నిస్తుంటారు. అలాంటిదేమీలేదు. లవ్‌ లో చాలా ఫెయిల్యూర్స్ వున్నాయి. ఎందుకంటే చాలా మంది అమ్మాయిల్ని ప్రేమించాను కాబట్టి!. పెళ్లి చేసుకోవాలంటే మన వ్యక్తిత్వంలో మెచ్యురిటీ వుండాలి. ఎలాంటి బాధ్యతనైనా తీసుకోగల సహనం వుండాలి. ఆ రెండు నాలో లేవనుకుంటాను. తెలుగు మంచి సక్సెస్‌లో వున్నప్పుడు వర్మ ముంబాయి రమ్మంటే వెళ్లిపోయాను. అక్కడ 'సత్య"లాంటి సినిమాతో మంచి బ్రేక్ వచ్చినా తిరిగి హైదరాబాద్ వచ్చి వ్యాపారం చేశాను. ఇలా ప్లానింగ్‌ తో కాకుండా ఆ సమయంలో నా మనసు ఎలా చెబితే అలా చేశాను. అందుకే నా వ్యక్తిత్వానికి పెళ్లి చేసుకోవడం సరికాదనిపించింది. మా అమ్మ మాత్రం ఎప్పుడూ పెళ్లి విషయాన్ని నా దగ్గర ప్రస్తావిస్తుంది. ఈ ఒక్క విషయంలోనే ఆమెను చాలా బాధపెట్టానని నా అభివూపాయం. ప్రస్తుతం నా తదుపరి సినిమాల గురించి చర్చలు జరుగుతున్నాయి. తమిళంలో రెండు సినిమాలు చేయబోతున్నాను. అందులో అర్జున్ కాంబినేషన్‌ లో ఓ చిత్రం వుంటుంది.

    English summary
    JD Chakravarthy is known for playing practical jokes. He is also known to take everything very lightly. This has been his nature right from his early days in Tollywood. All Telugu audiences know that JD Chakravarthy is a bachelor. Everyone thought he must be following his Guru RGV who says wife and husband relation is lie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X