Don't Miss!
- News టీడీపీ అభ్యర్దుల మార్పు, ఎవరెక్కడ - రఘురామ పై తాజా నిర్ణయం..!!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్‌క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
అందుకే పెళ్ళి చేసుకోలేదు..!: జెడి చక్రవర్తి
కథానాయకుల్లో జెడి చక్రవర్తి స్టైలే వేరు. ఏ విషయాన్నైనా నిర్మొహమాటంగా, ముక్కుసూటిగా చెప్పడం ఆయన ప్రత్యేకత. ఆయన ప్రతి మాటలో వ్యంగ్యం, సునిశితమైన హాస్యం తొంగిచూస్తాయి. చాలా కాలం విరామం తర్వాత జెడి చక్రవర్తి నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం 'మనీ మనీ మోర్ మనీ". 'మనీ, మనీ మనీ" చిత్రాలకు సీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రం ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ఓ సందర్భంలో పెళ్ళి ప్రస్థావన రాగా ఇలా స్పందించారు.
చాలా మంది పెళ్లెందుకు చేసుకోలేదని అడుగుతుంటారు. అంతే కాదు లవ్ ఫెయిల్యూరా అని ప్రశ్నిస్తుంటారు. అలాంటిదేమీలేదు. లవ్ లో చాలా ఫెయిల్యూర్స్ వున్నాయి. ఎందుకంటే చాలా మంది అమ్మాయిల్ని ప్రేమించాను కాబట్టి!. పెళ్లి చేసుకోవాలంటే మన వ్యక్తిత్వంలో మెచ్యురిటీ వుండాలి. ఎలాంటి బాధ్యతనైనా తీసుకోగల సహనం వుండాలి. ఆ రెండు నాలో లేవనుకుంటాను. తెలుగు మంచి సక్సెస్‌లో వున్నప్పుడు వర్మ ముంబాయి రమ్మంటే వెళ్లిపోయాను. అక్కడ 'సత్య"లాంటి సినిమాతో మంచి బ్రేక్ వచ్చినా తిరిగి హైదరాబాద్ వచ్చి వ్యాపారం చేశాను. ఇలా ప్లానింగ్ తో కాకుండా ఆ సమయంలో నా మనసు ఎలా చెబితే అలా చేశాను. అందుకే నా వ్యక్తిత్వానికి పెళ్లి చేసుకోవడం సరికాదనిపించింది. మా అమ్మ మాత్రం ఎప్పుడూ పెళ్లి విషయాన్ని నా దగ్గర ప్రస్తావిస్తుంది. ఈ ఒక్క విషయంలోనే ఆమెను చాలా బాధపెట్టానని నా అభివూపాయం. ప్రస్తుతం నా తదుపరి సినిమాల గురించి చర్చలు జరుగుతున్నాయి. తమిళంలో రెండు సినిమాలు చేయబోతున్నాను. అందులో అర్జున్ కాంబినేషన్ లో ఓ చిత్రం వుంటుంది.