నన్ను నేను దేవుడిలా ఫీలయిపోయి, గర్వంగా..రాజమౌళి
చిన్నతనంలో ఈ కథని నాతో పాటు మా కజిన్స్ ఉన్నప్పుడు మా అమ్మ చెప్పినప్పుడల్లా నన్ను నేను దేవుడిలా ఫీలయిపోయి, గర్వంగా రొమ్ము విరుచుకునేవాణ్ణి అంటూ చెప్పుకొచ్చారు స్టార్ డైరక్టర్ రాజమౌళి. ఇంతకీ వాళ్ళమ్మగారు చెప్పిన కథ ఏమిటీ అంటే...ఆయనకు రాజమౌళి అనే పేరు పెట్టడం గురించి. ఆయన పూర్తి పేరు శ్రీశైల శ్రీ రాజమౌళి. మంగళవారం ట్విట్టర్‌లో నా తల్లిదండ్రులు గొప్ప శివభక్తులు. ప్రతి శివరాత్రికీ వాళ్లు ఏదో ఒక జ్యోతిర్లింగాన్ని దర్శించుకుంటారు. అలా ఓసారి శ్రీశైలంకి వెళ్లినప్పుడు అక్కడ వచ్చిన ఓ కల తర్వాత నేను పుట్టానని మా అమ్మ చెబుతుంటుంది. ఆ కలలో తెల్లటి దుస్తుల్లో ఉన్న ఓ సాధువు వచ్చి అమ్మ చేతుల్లో ఓ బిడ్డని ఉంచాడంట. అందుకే నాకు 'శ్రీశైల శ్రీ రాజమౌళి' అని పేరు పెట్టారు అని చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











