మా బుల్లిదానికి కళ్లు అవే: అమితాబ్
కోడలు ఐశ్వర్య బేబీకి జన్మనిచ్చాక తన మనవరాలి గురించి అమితాబ్ తన బ్లాగులో తొలి వ్యాఖ్యలు చేశారు. నా మనవరాలు 9వ బచ్చన్ ఇప్పుడే తన కల్లు తెరుస్తోంది, ఆమె కళ్లు అచ్చం ఐశ్వర్య మాదిరే ఉన్నాయి...అంటూ పేర్కొన్నారు అమితాబ్. ఐశ్వర్య కళ్లు వాళ్ల అమ్మ వృందా రాయ్ మాదిరి ఉంటాయి కాబట్టి ఆమె పోలిక కూడా మా బుల్లి దాని కళ్లలో ఉందిని చెప్పారు. అభిషేక్ పుట్టినపుడు తొలిసారి మా తండ్రి హరివంశ్ రాయ్ వచ్చన్ చేతుల్లో ఉంచినప్పడు ఎంతో ఆనంద పడ్డారు. ఆ ఆనందం ఎలా ఉంటుందో నేను తొలిసారి ఇప్పుడు స్వయంగా అనుభవించాను అని అమితాబ్ తన బ్లాగులో పేర్కొన్నారు. నాకు తాతయ్య పోస్టు రాగానే...వేలాది మంది ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలుపుతూ సందేశాలు పంపారు. వాటిని చూసి నేను ఎంతో హ్యాపీగా ఫీలయ్యాను అని చెప్పుకొచ్చారు బిగ్ బి.
కాగా... బుల్లి ఐశ్వర్య ఈ లోకంలోకి అడుగుపెట్టగానే వారి కుటుంబ సభ్యులు, అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఆమె జాతకం, న్యూమరాలజీ ప్రకారం బుల్లి ఐశ్వర్య పేరు ఇంగ్లీషులో 'కె' అనే అక్షరంతో మొదలవుతుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











