twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆస్కార్ మెరుపులివే... తళుక్కుమన్న ప్రియాంక, భారతీయ నటుడు దేవ్‌పటేల్ కు తీవ్ర నిరాశ

    ప్రతిష్టాత్మక 89వ ఆస్కార్ అవార్డ్స్ 2017 వేడుక భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 5.30 గంటలకు ప్రారంభమైంది

    |

    ప్రతిష్టాత్మక 89వ ఆస్కార్ అవార్డ్స్ 2017 వేడుక భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 5.30 గంటలకు లాస్ ఏంజిల్స్‌లోని హాలీవుడ్ అండ్ హైల్యాండ్ సెంటర్‌లో ఉన్న డాల్బీ థియేటర్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన రెడ్ కార్పెట్‌పై హాలీవుడ్ తారలు హొయలొలికించారు. బాలీవుడ్ నుంచి ప్రియాంక చోప్రా రెడ్ కార్పెట్‌పై దర్శనమిచ్చింది. పొడవాటి గౌనులో ఆకట్టుకుంది. అలాగే ప్రముఖ నటీమణులు క్రిస్సీ టైజెన్, హేలీ బెర్రీ, వియోలా డేవిస్, ఎమ్మా స్టోన్, నికోల్ కిడ్మన్, ఓలివియా హామిల్టన్, స్కార్లెట్ జాన్సన్, అలికా వికండర్‌తో పాటు నటులు రిజ్ అహ్మద్, మాట్ డామన్, దేవ్ పటేల్, జాకీచాన్ తదితరులు పాల్గొన్నారు.

    క్వాంటికో టీవీ సిరీస్ ద్వారా హాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ తార ప్రియాంక చోప్రా. ఇప్పటికే హాలీవుడ్‌లో అనేక అవార్డులను సొంతం చేసుకున్న ఈ భామ సోమవారం ఉదయం (భారత కాలమానం ప్రకారం) లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో ప్రారంభమైన ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన రెడ్ కార్పెట్‌పై ప్రియాంక హొయలొలికించింది.

    The Academy Awards honored Mahershala Ali of

    ఉత్తమ సహాయనటుడు విభాగంలో పోటీపడిన దేవ్‌ పటేల్‌కు నిరాశ ఎదురైంది. ఈ విభాగంలో మూన్‌లైట్‌ చిత్రంలో నటించిన మహేర్షాలా అలీని అవార్డు వరించింది. ఆస్కార్‌ అవార్డు పొందిన మొదటి ముస్లిం నటుడు మహేర్షాలా అలీనే కావడం విశేషం. ఏడు ముస్లిం దేశాలపై ట్రంప్‌ ట్రావెల్‌ బ్యాన్‌ను విధించిన నేపథ్యంలో.. మహేర్షాలా ఆస్కార్‌ గెలవడంపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది.

    The Academy Awards (Oscar) 2017 updates

    2017 ఆస్కార్‌ విజేతలు వీరే
    * ఉత్త‌మ చిత్రం: మూన్‌లైట్‌
    * ఉత్త‌మ న‌టి: ఎమ్మా స్టోన్‌(లా లా ల్యాండ్‌)
    * ఉత్త‌మ న‌టుడు: క‌సే ఎఫ్లెక్‌(మాంచెస్ట‌ర్ బై ద సీ)
    * ఉత్త‌మ ద‌ర్శ‌కుడు: డేమియ‌న్ చాజెల్‌ (లా లా ల్యాండ్‌)
    * అడాప్టెడ్ స్క్రీన్ ప్లే: మూన్‌లైట్ (బ్యారీ జెన్కిన్స్‌, ట‌రెల్ అల్విన్ మెక్‌క్ర‌నే)
    * ఉత్త‌మ స్క్రీన్‌ప్లే: మాంచెస్ట‌ర్‌ బై ద సీ(కెన్న‌త్ లొనెర్గాన్‌)
    * ఉత్త‌మ ఒరిజిన‌ల్ సాంగ్‌: సిటీ ఆఫ్ స్టార్స్‌(లా లా ల్యాండ్‌)
    * ఉత్త‌మ‌ ఒరిజిన‌ల్ స్కోర్‌: లా లా ల్యాండ్‌
    *ఉత్త‌మ ఛాయాగ్ర‌హ‌ణం: లాలా ల్యాండ్‌( లిన‌స్ శాన్‌గ్రెన్‌)
    * ఉత్త‌మ లైవ్ యాక్ష‌న్ షార్ట్‌: సింగ్(క్రిస్ట‌ఫ్ డీక్‌, అన్నా యుడ్వ‌ర్డీ)
    * ఉత్త‌మ డాక్యుమెంట‌రీ ల‌ఘు చిత్రం: ద వైట్ హెల్మెట్స్‌(ఓర్లాండో వోన్ ఇన్సీడెల్‌, జోన్నా న‌ట‌సెగర‌)
    * ఉత్త‌మ ఎడిటింగ్‌: హాక్సా రిడ్జ్‌(జాన్ గిల్బ‌ర్ట్‌)
    * ఉత్త‌మ‌ విజువ‌ల్ ఎఫెక్ట్‌: ద జంగిల్ బుక్‌ (రాబ‌ర్ట్ లిగాటో, ఆడ‌మ్ వాల్డెజ్‌, ఆండ్ర్యూ ఆర్‌. జాన్స్, డ్యాన్ లెమ‌న్‌)
    * ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌: లాలా ల్యాండ్‌(డేవిడ్ వాస్కో, శాండీ రేనాల్డ్స్‌)
    * యానిమేటెడ్ ల‌ఘు చిత్రం: పైప‌ర్‌(అలాన్ స‌రిల్ల‌రో, మార్క్ స‌న్డెల్‌మెర్‌)
    * యానిమేటెడ్ ఫీచ‌ర్ చిత్రం: జూటోపియా(బైరాన్ హోవ‌ర్డ్‌, రిచ్ మూరే, క్లార్క్ స్పెన్స‌ర్‌)
    * ఉత్త‌మ విదేశీచిత్రం: సేల్స్‌మ్యాన్‌(ఇరాన్‌)
    * ఉత్త‌మ స‌హాయ‌న‌టి: వివోలా డేవిస్‌(ఫెన్సెస్‌)
    * సౌండ్ మిక్సింగ్‌: హాక్సా రిడ్జ్‌
    * సౌండ్ ఎడిటింగ్‌: అరైవ‌ల్‌(బెల్లీమార్‌)
    * ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్‌: ఒ.జె. మేడ్‌ ఇన్‌ అమెరికా(ఎజ్రా ఎడిల్‌మ్యాన్‌, కరోలైన్‌ వాటర్లో)
    * ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైన్‌: ఫెంటాస్టిక్‌ బీస్ట్స్‌ అండ్‌ వేర్‌ టూ ఫైండ్‌ ధెమ్‌(కొలెన్‌ ఎట్‌ఉడ్‌)
    * ఉత్త‌మ అలంక‌ర‌ణ‌, కేశాలంకరణ: సుసైడ్‌ స్క్వాడ్‌ ( అల్సాండ్రో బెర్టాల్జీ, జిర్జోయో గెగ్రేరియన్‌, క్రిస్టోఫర్‌ నీల్స‌న్‌‌)
    * ఉత్తమ సహాయనటుడు: మహేర్షల అలీ(మూన్‌లైట్‌)

    English summary
    The Academy Awards honored Mahershala Ali of "Moonlight" and Viola Davis of "Fences" in early acting awards.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X