బాహుబలిలో తమన్నాను తొక్కేసారా? రాజమౌళితో.. కారణం అదేనా?

బాహుబలి1 చిత్రంలో తమన్నా గ్లామర్, యాక్షన్ పార్ట్ ఆ చిత్రానికి హైలెట్‌గా నిలిచాయి. అయితే బాహుబలి2 సినిమాలో అవంతిక పాత్ర బాగానే ఉంటుందని అనుకొన్న ప్రేక్షకులకు, అభిమానులకు నిరాశ మిగిలింది.

By Rajababu

బాహుబలి ది బిగినింగ్ చూసిన తర్వాత చాలామంది అవంతిక పాత్రలో కనిపించిన తమన్నా గురించే మాట్లాడుకొన్నారు. బాహుబలి1 చిత్రంలో తమన్నా గ్లామర్, యాక్షన్ పార్ట్ ఆ చిత్రానికి హైలెట్‌గా నిలిచాయి. అయితే బాహుబలి2 సినిమాలో అవంతిక పాత్ర బాగానే ఉంటుందని అనుకొన్న ప్రేక్షకులకు, అభిమానులకు నిరాశ మిగిలింది. బాహుబలి2లో అవంతిక పాత్ర ఒకటో అరా సీన్లలో తప్పా దాదాపు ఎక్కడ కనిపించదు. అందేటి అవంతిక పాత్రను ఎందుకలా విస్మరించారు అనే చర్చ మొదలైంది. రాజమౌళితో గొడవ కారణంగానే అవంతిక పాత్రకు అంతగా ప్రాధాన్యం ఇవ్వడం లేదనే రూమర్ వినిపిస్తున్నది. అయితే ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. రాజమౌళితో నాకు ఎలాంటి విభేదాలు లేవని తమన్నా ఖండించిన సంగతి తెలిసిందే.

క్లైమాక్స్ నాపైనే..

క్లైమాక్స్ నాపైనే..

సినిమాకు కీలకమైన క్లైమాక్స్‌లో నాది చాలా కీలకమైన పాత్ర. క్లైమాక్స్ అంతా నాపైనే ఉంటుంది. క్లైమాక్స్‌లో నేనేంటో తెలుస్తుంది. బాహుబలి1 క్లైమాక్స్‌లో నేను అసలే కనిపించను. కానీ బాహుబలి2లో నా పాత్ర ఎక్కువగా ఉంటుంది. ఇంతకంటే నేను ఎక్కువ చెప్పలేను. చెబితే చాలా ఘోరం జరిగిపోతుంది.

అది సమస్య కానే కాదు..

అది సమస్య కానే కాదు..

బాహుబలి2 ట్రైలర్ మరో అద్భుతం. ప్రేక్షకులు పెట్టుకొన్న అన్ని అంచనాలను ట్రైలర్ అధిగమించింది. అందుకే బ్రహ్మండమైన రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్‌లో నేను ఉన్నానా లేదా అనేది సమస్య కాదు. బాహుబలి1 ప్రోమోలో ఒకే షాట్ ఉంటుంది. ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రేక్షకులు సినిమా చూసినప్పుడు నా పాత్ర ఏంటో వారికి అర్థమవుతుంది. బాహుబలి సినిమా నా కెరీర్‌లో ఎంతో మార్పు తెచ్చింది

బాహుబలికి సమానంగా..

బాహుబలికి సమానంగా..

బాహుబలి లాంటి పాత్ర లభించడం నిజంగా వండర్. బాహుబలి పాత్రకు సమానంగా యుద్ధాలు చేయడం, శత్రువులను సంహరించడం లాంటి అంశాలు ఏ యాక్టర్‌కైనా గర్వమే. అలాంటి ఒక్కసీన్ చేసిన.. అలాంటి సినిమాలో భాగమైన అదృష్టమే. బాహుబలిలో అది నాకు దక్కింది. బాహుబలి2లోనూ నాది అదే పాత్ర. నా పాత్రలో ఏలాంటి మార్పులు ఉండవు. బాహుబలి2 కోసం మళ్లీ కత్తిసాము, ఫైటింగ్ నేర్చుకొన్నాను. బాహుబలి1 బ్లాక్‌బస్టర్ కావడంతో బాహుబలి2పై భారీగా ఖర్చుపెట్టాల్సి వచ్చింది.

అవంతిక పాత్ర తేలిపోయింది..

అవంతిక పాత్ర తేలిపోయింది..

అయితే పైన చెప్పిన దానికి బాహుబలి2 చూసిన తర్వాత కనిపించిన దానిని పట్టి చూస్తే అవంతిక పాత్ర కేవలం బాహుబలి1 నడిపించడానికనే విషయం తేలిపోయింది. రాజమౌళితో తమన్నాకు నెలకొన్న విభేదాల కారణంగానే పాత్రను కోతపెట్టారా అనే వాదన వినిపిస్తున్నది. బాహుబలి2 సినిమాలో గట్టిగా చూస్తే ఒకటి అరా సన్నివేశాలు తప్పా ఏమి కనిపించదు. క్లైమాక్స్‌లో తమన్నా కనిపించినా గుంపులో గోవిందమ్మే. తెరమీద ఆమె కనిపించగానే ‘ఈమె కూడా సినిమాలో ఉంది కదా' అని థియేటర్లో గట్టిగా అనడాన్ని బట్టి చూస్తే తమన్నా పాత్ర ఎంత మేరకు పడిపోయిందో అర్థమవుతుంది.

రాజమౌళితో గొడవలు లేవు..

రాజమౌళితో గొడవలు లేవు..

రాజమౌళితో గొడవ పడ్డానని వచ్చిన వార్తలు రూమర్లే. పేపర్లో రాసుకోవడానికి గొప్పగా ఉంటాయి. రాజమౌళి సార్ అంటే నాకు చాలా ఇష్టం. ఎప్పటికీ నేను అభిమానిస్తాను. అందులో ఎలాంటి మార్పు ఉండదు. ఈ విషయంపై మీడియా బాగా గాసిప్స్ రాసింది. మేము చదువుకొని నవ్వుకొన్నాం అని తమన్నా చెప్పడం గమనార్హం.

కనీసం రోలింగ్ టైటిల్స్‌లోనైనా

కనీసం రోలింగ్ టైటిల్స్‌లోనైనా

యుద్ధ సన్నివేశాల్లో తమన్నాపై అసలు ఫోకస్సే లేదు. దేవసేన చివర్లో అగ్నిప్రస్థం తీసుకెళ్లే సమయంలో ఆమెకు రక్షణగా వెంట వెళ్లడం మినహాయిస్తే సినిమాలో తమన్నా ఉన్నట్టు అనిపించదు. పట్టాభిషేకం తర్వాత రోలింగ్ టైటిల్స్‌లో కనీసం మహేంద్ర బాహుబలితో అవంతికకు పెళ్లయినట్లయినా చూపించినా అభిమానులు కొంచెమైనా సంతృప్తి చెందేవాళ్లేమో. మరి వాస్తవం ఇలా ఉంటే తమన్నా అలా ఎలా చెప్పుకుందో మరి. అయితే తమన్నా మీద బాహుబలి2లో కొన్ని సన్నివేశాలు తీశాం. కానీ లెంగ్త్ పెరిగిపోవడంతో వాటిని ఎడిటింగ్‌లో నిర్దాక్షిణ్యంగా తీసి పక్కన పడేశాం అని యూనిట్ వర్గాలు పేర్కొంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X