»   »  తెరపై ఆ అద్భుతం

తెరపై ఆ అద్భుతం

Posted By:
Subscribe to Filmibeat Telugu
Alchemist
"నీవు చేస్తున్న దాన్ని గాఢంగా విశ్వసించి అమలు జరుపుతూంటే విశ్వం మొత్తం నీకు అనుకూలంగా కుట్ర చేస్తుంది" అనే విచిత్రమైన కాన్సెప్ట్ తో వచ్చిన పుస్తకం 'ది అల్కెమిస్ట్' .ఎన్నో భాషల్లోకి అనువాదమయ్యి ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిన ఈ నవలా రచయిత పాల్ కొయిరొ .ఈ నవల ఈ మథ్య తెలుగు లోకి 'పరుసవేది' పేరుతో అనువాదమైంది. ఇక్కడా యువతరం ఆరాథ్య పుస్తకంగా మారింది. ఎందుకంటే చాలామంది ఈ పుస్తకాన్ని మామూలుగా చదివి ప్రక్కన పడేసే బుక్ గా గాక తమ జీవిత మార్గాన్ని భోథించే దివ్య ప్రభంధం గా భావించారు. అంత ఖ్యాతి కల్గిన ఆ పుస్తకం ఇప్పుడుల హాలీవుడ్ లో తెరకెక్కబోతోంది. ప్రముఖ హాలివుడ్ నిర్మాత హార్వే వీన్ ఈ విషయాన్ని కేన్స్ ఫిలిం ఫెస్టవల్ లో స్వయంగా మీడియాకు తెలియజేసారు .దాదాపు 15 ఏళ్ళగా ఈ పుస్తకాన్ని చాలామంది తెరకెక్కించాలని ప్రయత్నాలు చేసారు.

అందులో మన ఇండియన్ దర్శకుడు శేఖర్ కపూర్ కూడా ఉన్నారు. ఎవరికి వాళ్ళే స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారు కాని ముందుకు వెళ్ళ లేక పోయారు. అసలు ఆ పుస్తకం కూడా అదే విషయాన్ని చెపుతుంది. జీవితం అంటే అమూల్య మైన నిథి కోసం మానవులు చేసే అద్బుత అన్వేషణ అంటుంది. ఆ కథలో ఒక గొర్రెల కాపరి తన కలలో కనపడిన నిధి ని అన్వేషించు కుంటూ వెళ్ళిపోతాడు. ఆ ప్రయాణంలో అతనికి రకరకాల అనుభవాలు తారసపడతాయి. రకరకాల వ్యక్తులు జీవితాన్ని బోధిస్తారు. చాలా చోట్ల కంఫర్ట్ జోన్స్ తగులుతాయి. రిలాక్స్ అయితే ఎంత ప్రమాదమో తెలియపరుస్తాయి. అలా అతని ప్రయాణం యావత్తు విశ్వం మొత్త తోర్పడి నిధి ఎక్కడో లేదు నీలోనే ఉంది వెతుకు అన్న విషయాన్ని భోదిస్తుంది. ఈ సన్నివేసాలు తెరమీద చూడటం ఉత్సాహభరితమే. ఇప్పటికే ఎన్నో బయొగ్రఫిలు, నవలలు, తెరమీదకు మనోహరంగా తీసుకు వచ్చిన హాలీవుడ్ వారు దీన్ని గొప్పగా తీస్తారనటంలో సందేహం లేదని ఈ పుస్తక అభిమానులు అనుకుంటున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X