Don't Miss!
- News మేషరాశిలో శుక్ర దహనం.. ఈ రాశులవారికి కెరీర్ లో పెనుసవాళ్లు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
తెలుగు మెరుపుల అవతార్: అవతార్ 2ఆర్ట్ డైరెక్టర్గా తెలుగు అమ్మాయి
2009లో వచ్చిన హాలీవుడ్ చిత్రం అవతార్ ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరో లోకాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసిన ఆ చిత్రానికి సీక్వెల్స్ అందించే పనిలో ఉన్నారు ఆ చిత్ర దర్శకుడు జేమ్స్ కామెరాన్. 2020 డిసెంబర్ 18న 'అవతార్ 2' విడుదల కానుండగా.. డిసెంబర్ 17, 2021న 'అవతార్ 3' విడుదల కానుంది.
ఆశ్రితా కామత్
2023 డిసెంబర్ లో 'అవతార్ 4', 2025లో 'అవతార్ 5' రిలీజ్ కానున్నాయి. ఇదిలా ఉంటే.. 'అవతార్ 2' చిత్రానికి ఓ భారతీయ మహిళ ఆర్ట్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఆశ్రితా కామత్ అనే యంగ్ గాళ్.. ఇ్పపుడు జేమ్స్ కేమరాన్ దర్శకత్వంలో రూపొందుతున్న అవతార్ 2 చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్2గా పని చేస్తోంది.
నెంబర్1 ఫిలిం ఇనిస్టిట్యూట్
ప్రపంచంలోనే నెంబర్1 ఫిలిం ఇనిస్టిట్యూట్ అయిన.. అమెరికన్ ఫిలిం ఇనిస్టిట్యూట్ నుంచి ప్రొడక్షన్ డిజైన్ లో ఎంఎఫ్ ఏ చేసింది ఆశ్రిత. ఆమె చేసిన మొదటి థీసిస్ ఫిలిమ్ 'ఇంటర్ స్టేట్'కు 2014లో 41వ స్టూడెంట్ అకాడమీ అవార్డ్స్ లో రజిత పతకం లభించింది.
డస్ట్ ల్యాండ్
రెండో థీసిస్ ఫిలిం 'డస్ట్ ల్యాండ్'.. బెస్ట్ ప్రొడక్షన్ అండ్ ఆర్ట్ డిజైన్ విభాగంలో ఫిలింక్వెస్ట్ కు నామినేట్ అయింది. ఆశ్రిత తల్లి గ్రాఫిక్ డిజైనర్ కాగా.. తనకు తొలి టీచర్ తన అమ్మే అంటుంది ఆశ్రిత కామత్. గతంలో జిందగీ న మిలేగీ దుబారా చిత్రానికి ప్రాపర్టీ మాస్టర్ గా వర్క్ చేసింది.
స్టీవెన్ స్పీల్ బర్గ్ మూవీ- బీఎఫ్ జీ
తర్వాత.. హాలీవుడ్ లో స్కల్ ఐలాండ్.. ఐ సీ యు.. పసిఫిక్ రిమ్:అప్రైజింగ్ తో పాటు స్టీవెన్ స్పీల్ బర్గ్ మూవీ బీఎఫ్ జీ కి కూడా వర్క్ చేసింది. ఇప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న జేమ్స్ కామరాన్ ముూవీ అవతార్2 కు ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తోంది. తనకు ఇంతగా గుర్తింపు లభిస్తోందంటే.. అందుకు కారణం తన కుటుంబం అంటోంది ఆశ్రితా.