twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చాలా నష్టపోయాను, అందుకే ఇలా...( ఆడియో వేడుకలో ప్రకాష్ రాజ్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ప్రకాష్‌ రాజ్‌ ప్రొడక్షన్స్‌, ఫస్ట్‌ కాపీ పిక్చర్స్‌ బ్యానర్స్‌పై ప్రకాష్‌ దర్శక నిర్మాణంలో రూపొందుతోన్న చిత్రం 'మనవూరి రామాయణం'. ప్రకాష్‌ రాజ్‌, ప్రియమణి, సత్య తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.

    ఇళయరాజా సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. బిగ్‌ సీడీ, ఆడియో సీడీలను అక్కినేని నాగార్జున విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు టాప్ సినీ దర్శకులు హాజరయ్యారు.

    ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున మాట్లాడుతూ - ''ప్రతి మనిషిలో రాముడు, రావణాసురుడు ఉంటారు. ఎన్టీఆర్‌గారు చేసిన రావణాసురుడు రోల్‌ చూశాను. పుస్తకాల్లో చదివాను. అందుకే రావణాసురుడు అంటే నాకు కూడా ఇష్టమే. ప్రకాష్‌ రాజ్‌ జీవితంలో ప్రతి క్షణాన్ని ఎంజాయ్‌ చేస్తాడు. తనలా ఉండటానికి నేనెంతో ప్రయత్నించాను. ఏ పని చేసినా ప్రకాష్‌ ఎంజాయ్‌ చేస్తాడు. ప్రకాష్‌ రాజ్‌ దర్శకత్వంలో మనవూరి రామాయణం రూపొందడం ఆనందంగా ఉంది. ఈ సినిమాకు ప్రకాష్‌ రాజ్‌గారికి దర్శకుడిగా కూడా నేషనల్‌ అవార్డ్‌ రావాలని కోరుకుంటున్నాను' అన్నారు.

     సినిమా గురించి వివరిస్తూ..

    సినిమా గురించి వివరిస్తూ..

    ప్రకాష్‌ రాజ్‌ మాట్లాడుతూ - ''ఒక దర్శకుడిగా కథ, పాత్ర అనుకున్నప్పుడు, నదిలాంటి ఆ పాత్రను చేయడానికి ప్రియమణియే కరెక్ట్‌ అనిపించింది. చాలా ఇంట్రెస్టింగ్‌ రోల్‌. ముగ్గురి జీవితంలో మార్పును, వేరే కోణాన్ని చూపించి వెళ్ళిపోయే క్యారెక్టర్‌. ప్రియమణి లేకుండా ఈ కథను ఊహించుకోలేను. తను ఇంటెన్స్‌ నటి. సత్య, పూరి జ్యోతిలక్ష్మి సినిమా చూసినప్పుడు యాక్టర్‌ అవుదామని వచ్చిన నటుడుగా గుర్తించాను. నా కథకు కావాల్సిన వ్యక్తిని నేను తనలో చూశాను. తను అద్భుతమైన నటుడు. కెమెరామెన్‌ ముకేష్‌కి సూపర్బ్‌ విజుల్‌ సెన్స్‌ ఉంది. ఇళయరాజాగారు అద్భుతమైన మ్యూజిక్‌ అందించారు' అని తెలిపారు.

     రిలీజ్ చేయకుండా చాలా నష్టపోయాను

    రిలీజ్ చేయకుండా చాలా నష్టపోయాను

    ‘సినిమా చేయగలను కానీ, రిలీజ్‌ చేయకుండా చాలా నష్టపోయాను. కాబట్టి నేను అభిషేక్‌ పిక్చర్స్‌ వారిని కలిసి సినిమా చూడమన్నాను. సినిమా చూసినప్పటి నుండి రిలీజ్‌కు వారెంతో సపోర్ట్‌ చేశారు' అని ప్రకాష్ రాజ్ అన్నారు.

     నన్ను మహానటుడు, గొప్ప నటుడు అంటున్నారు

    నన్ను మహానటుడు, గొప్ప నటుడు అంటున్నారు


    ‘అందరూ నన్ను మహానటుడు, గొప్ప నటుడు అంటున్నారు. దాంతో నేను కంఫర్ట్‌ జోన్‌లోకి వెళ్ళిపోతున్నాను. కానీ నేను ఒక విద్యార్థిలా నిలబడటానికే ఇష్టపడతాను. అందుకే దర్శకుడయ్యాను. అంతే కాకుండా నాకు ఒక తరహా కథలను చెప్పాలని ఉంటుంది. అందుకే దర్శకుడినయ్యాను. నేను నటించే సినిమాలు వేరు, నేను డైరెక్ట్‌ చేసే సినిమాలు వేరు. నేను కమర్షియల్‌ సినిమాలు చేయలేను. నాకు తెలిసింది మాత్రమే చేయగలను. దర్శత్వం నాకు ఎంతో ఆనందాన్నిస్తుంది. నటుడిగా ఒక పని చేస్తున్నాను. కానీ దర్శకుడిగా మారిన తర్వాత చాలా విషయాలు తెలుసుకుంటున్నాను. దర్శకుడిగా నేను చేసిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఆదరించి నాకు ఊపునిస్తారని అనుకుంటున్నాను' అన్నారు ప్రకాష్ రాజ్.

     ప్రకాష్‌ ఎక్కడుంటే అక్కడ పచ్చగా ఉంటుంది

    ప్రకాష్‌ ఎక్కడుంటే అక్కడ పచ్చగా ఉంటుంది

    పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ - ''ప్రకాష్‌ రాజ్ ఎక్కడుంటే అక్కడ పచ్చగా ఉంటుంది. తనొక విలేజ్‌ను దత్తత తీసుకుని అక్కడకెళ్లి అందరితో కలుస్తుంటాడు. ఇన్ని పనులు ఎప్పుడూ బిజీగా ఉన్న ప్రకాష్‌ రాజ్‌ చేస్తాడని చాలా మందికి తెలియదు. ఐ లవ్‌ ప్రకాష్‌ రాజ్‌..ప్రియమణి చాలా మంచి నటి. సత్యను ఈ సినిమాలో తీసుకోమని నేనే ప్రకాష్‌రాజ్‌కు ఓ రకంగా రెకమెండ్‌ చేశాను. తనెంతో మంచి నటుడని మెచ్చుకున్నాడు' అందరికీ ఆల్ ది బెస్ట్ అన్నారు.

     ప్రకాష్‌ రాజ్‌గారు దర్శకత్వంతో పాటు

    ప్రకాష్‌ రాజ్‌గారు దర్శకత్వంతో పాటు

    బోయపాటి శ్రీను మాట్లాడుతూ - ''నా మొదటి సినిమా భద్ర, దాన్ని నేను ఎప్పటికీ మరచిపోలేను. భద్ర అనే కథకు ఒక పిల్లర్‌ రవితేజగారైతే మరో పిల్లర్‌ ప్రకాష్‌రాజ్‌గారే. ఒక మంచి విషయం ప్రజల్లోకి వెళ్లాలనుకుంటే మంచి నటుడు అవసరం. భద్ర సినిమాలో ప్రకాష్‌ రాజ్‌గారు చేసిన క్యారెక్టర్‌ అందరికీ బాగా కనెక్ట్‌ అయ్యింది. ఆ సినిమా సక్సెస్‌లో ఆయన కూడా ఓ భాగం. ఎంతో మంది దర్శకులు వారు డైరెక్ట్‌ చేస్తున్న సినిమాల్లో కాకుండా వేరే దర్శకుల సినిమాల్లో యాక్ట్‌ చేశారు. కానీ ప్రకాష్‌ రాజ్‌గారు దర్శకత్వంతో పాటు నటిస్తున్నారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను' అన్నారు.

     ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి

    ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి

    సుకుమార్‌ మాట్లాడుతూ - ''దర్శకులందరూ ప్రకాష్‌ రాజ్‌గారితో సినిమా చేయాలనుకుంటారు. ఈ జనరేషన్‌లో అలాంటి గౌరవాన్ని పొందిన వ్యక్తి ప్రకాష్‌రాజ్‌గారు. ఎంతో దర్శకులు విలక్షణ శైలితో, లేకుంటే వాటి కంటే ఇంకా బెటర్‌మెంట్‌తోనో సినిమా చేసుంటారని చెప్పగలను. నటుడుగా దర్శకుల నుండి కావాల్సిన విషయాన్ని రాబట్టుకోగల మంచి నటుడు ప్రకాష్‌రాజ్‌గారు. ఒక పక్క నటిస్తూ, దర్శకత్వం వహించడమంటే మామూలు విషయం కాదు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఈ సినిమా అతి పెద్ద హిట్‌ కావాలి. ఆల్‌ ది బెస్ట్‌'' అన్నారు.

     తిరునాళ్ళలో చిన్నపిల్లాడిని ఓ పెద్ద వ్యక్తి ఎత్తుకుని చూపినట్లు

    తిరునాళ్ళలో చిన్నపిల్లాడిని ఓ పెద్ద వ్యక్తి ఎత్తుకుని చూపినట్లు

    సత్య మాట్లాడుతూ - ''నేను ఈరోజు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నానంటే కారణం ఇద్దరు వ్యక్తులు అందులో ఒకరు పూరి జగన్నాథ్‌గారు అయితే మరొకరు ప్రకాష్‌రాజ్‌గారు. తిరునాళ్ళలో చిన్నపిల్లాడిని ఓ పెద్ద వ్యక్తి తన భుజాలపై మోసుకుని అందరినీ చూపించే విధంగా పూరిగారు నాకు ఇండస్ట్రీ అంటే ఏంటో చూపించారు. అలాగే నేను ఒక యాక్టర్‌ కావడానికి ప్రకాష్‌రాజ్‌గారే ఇన్‌స్పిరేషన్‌' అన్నారు.

     అందరికీ నచ్చే సినిమా

    అందరికీ నచ్చే సినిమా

    ప్రియమణి మాట్లాడుతూ - ''ప్రకాష్‌రాజ్‌గారి దర్శకత్వంలో సినిమా చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ప్రకాష్‌రాజ్‌గారిలాంటి నటుడితో ఇప్పటి వరకు పనిచేయలేదని చెప్పగలను. తను అంత మంచి నటుడు. ఆయన ఈ సినిమాలో చాలా మంచి క్యారెక్టర్‌ ఉంది నువ్వే చేయాలని చెప్పగానే, వెంటనే ఓకే చెప్పేశాను. చాలా స్పెషల్‌ క్యారెక్టర్‌. ప్రకాష్‌గారు నాకు అవకాశం ఇవ్వకుంటే నేను మంచి సినిమాను మిస్‌ అయ్యేదాన్ని అని ప్రియమణి తెలిపారు.

    English summary
    The audio of 'Mana Oori Ramayanam' was released on the hands of 'King' Nagarjuna yesterday at a Hyderabad hotel.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X