twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బెస్ట్ అండ్ వరస్ట్ బిగ్ బి బర్త్‌డే బాష్

    By Bojja Kumar
    |

    ముంబై : బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ 70వ పుట్టిన రోజు వేడుక ఇటీవల ముంబైలో గ్రాండ్‌గా జరిగిన విషయం తెలిసిందే. బాలీవుడ్ నుండే కాకుండా ఇండియాలోని అన్ని సినీ పరిశ్రమల్లోని ప్రముఖులు ఈ సెలబ్రేషన్స్ కి హాజరయ్యారు. బాలీవుడ్ స్టార్స్ షారుక్ ఖాన్, దీపిక పడుకొనె, పరిణితి చోప్రా, అజయ్ దేవగన్, కాజోల్, విద్యా బాలన్, బిపాసా బసు, ప్రాచీ దేశాయ్, అమీషా పటేల్ లాంటి స్టార్స్ తమ వస్త్ర ధారణతో చూపరులను ఆకట్టుకున్నారు.

    బెస్ట్ అండ్ వరస్ట్ @ బిగ్ బి బర్త్‌డే బాష్

    బిగ్ బి బర్త్ డే పార్టీకి హాజరైన షారుక్, గౌరీ తమ డ్రెస్సింగుతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ దంపతులది బెస్ట్ డ్రెస్సింగ్‌గా చెప్పుకుంటున్నారంతా. అయితే అజయ్ దేవగన్-కాజోల్ డ్రెస్సింగ్ స్టైల్ మాత్రం వరస్ట్‌గా ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

    బెస్ట్ అండ్ వరస్ట్ @ బిగ్ బి బర్త్‌డే బాష్

    ఇక పార్టీలో ముఖ్య వ్యక్తులు అయిన అబిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ డ్రెస్సింగ్ విషయానికొస్తే.....ఐశ్వర్యరాయ్ అదరిపోయేలా డ్రెస్సింగ్ వేసుకుంటే, అభిషేక్ మాత్రం స్టార్ హోటల్లో సర్వర్‌లా చెత్తగా డ్రెస్సింగ్ వేసుకున్నాడు.

     బెస్ట్ అండ్ వరస్ట్ @ బిగ్ బి బర్త్‌డే బాష్

    ఫ్యాషన్లో విభిన్నతను ప్రదర్శించే హాట్ గర్ల్ దీపిక పడుకొనె ఈ వేడుకలో ఇండియన్ ట్రెడిషనల్ హాట్ హాట్‌గా మెరిసి పోయింది. అయితే పరిణితి చోప్రా డ్రెస్సింగ్ స్టైల్ ఫర్వాలేదు కానీ, ఆ డ్రెస్సు కలరే చెత్తగా ఉందంటున్నారు.

    బెస్ట్ అండ్ వరస్ట్ @ బిగ్ బి బర్త్‌డే బాష్

    ప్రాచీ దేశాయ్ మోడ్రన్ డ్రెస్ లో మెరిసి పోయింది. సినిమాల్లో చీకట్టుతో హాట్ హాట్‌గా కనిపించే విద్యా బాలన్ ఇక్కడ మాత్రం తన చీరకట్టుతో ఆకట్టుకోలేక పోయింది.

    బెస్ట్ అండ్ వరస్ట్ @ బిగ్ బి బర్త్‌డే బాష్

    బిపాసా బసు వైట్ గౌన్‌లో సెక్సీగా కనిపిస్తే....అమీషా పటేల్ మాత్రం పాత ఫ్యాషన్ ఫాలో అవుతూ వరస్ట్ డ్రెస్సింగ్ లిస్టులో చేరి పోయింది.

    సాధారణంగా ఇలాంటి పెద్ద పెద్ద పార్టీలు జరిగినప్పుడు మీడియా దృష్టంతా పార్టీలకు హాజరయ్యే సెలబ్రిటీల మీదనే. పార్టీకి ఎవరు ఎవరితో వచ్చారు, ఎవరితో క్లోజ్‌‌గా మూవ్ అవుతున్నారు, ఎలాంటి డ్రెస్సులు వేసుకున్నారు లాంటి వాటిని ఎక్కువ ఫోకస్ చేస్తుంటారు.

    పార్టీలో ఎవరు ఎవరితోనైనా క్లోజ్‌గా మూవ్ అయితే....ఇద్దరి మధ్య ఏదో సంబంధం ఉందనే వార్తలు గుప్పుమనడం సర్వసాధారణం. కొందరు స్టార్లు కూడా మీడియా వారికి వార్తల విందు చేయడానికే అన్నట్లుగా కొన్ని కొంటె పనులు చేస్తుంటారు. అదే విధంగా సెల్రబిటీలు అదిరిపోయే డ్రెస్సు వేసినా న్యూసే....చెత్తగా డ్రెస్సులు వేసినా న్యూసే అవుతుంది ఈ కాలంలో. బిగ్ బి బర్త్ డే పార్టీకి ఎవరు బెస్ట్ డ్రెస్ వేసుకున్నారు...ఎవరు చెత్త డ్రెస్ వేసుకున్నారు...అనే దానిపై ఓ లుక్కేద్దాం.

    English summary
    
 Amitabh Bachchan's family (Jaya, Abhishek, Aishwarya Rai Bachchan) arranged a big birthday bash to celebrate his 70th birthday on Wednesday. Bollywood's who's who attended Amitabh's birthday celebrations. Stars like Shahrukh Khan with Gauri, Deepika Padukone, Parineeti Chopra, Ajay Devgn with Kajol, Vidya Balan, Bipasha Basu, Prachi Desai graced the event with their presence. The party came to an end around 4.30 am. Here are the pictures of the best and the worst dressed celebrities at Amitabh Bachchan's birthday bash.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X