'ది బిజినెస్ మ్యాన్' ఆడియో కవర్, పాటలు ఇవే
పూరీ, మహేష్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న తాజా చిత్రం ది బిజినెస్ మ్యాన్. ఈ చిత్రం ఆడియో డిసెంబర్ 22న శిల్పకళా వేదికలో విడుదల కానుంది. ఇక ఈ చిత్రానికి సంభందించి ఆడియో కవర్ ఇప్పటికే బయటకు వచ్చి అందరినీ ఆకట్టుకుంటోంది. (ప్రక్కనున్న ఫోటో అదే). ఇక ఈ చిత్రంలో తమన్ స్వరపరచిన ఆరు పాటలు ఉన్నాయి.
ఆ ట్రాక్ లిస్ట్..
1. ముంబై ముంబై
సింగర్-హరి చరణ్
2. చందమామ
సింగర్-ధమన్
3. సర్ ..వస్తారో వస్తారా
సింగర్స్-ప్రియ హిమేష్, గీతా మాధురి
4. పిల్ల చావ్...
సింగర్-రాహుల్ నంబియార్
5. బిజినెస్ మ్యాన్ ధీమ్ సాంగ్
సింగర్స్-మహేష్, పూరీ, కోరస్
6. ముంబై ముంబై...
సింగర్-ధమన్
ఇందులో ఆరు పాటలని భాస్కరభట్ల రవికుమార్ రాసారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని అందివ్వాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో తొలిసారిగా కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం నేపధ్యం ముంబై మాఫియాలోని ఆయుధాల వ్యాపారం..కొనుగోళ్ళు ..అమ్మకాల చుట్టూ తిరగనుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: థమన్, ఛాయాగ్రహణం: శ్యామ్.కె.నాయుడు, కళ: చిన్నా, ఫైట్స్: విజయ్, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, సహనిర్మాత: వి.సురేష్‌రెడ్డి, నిర్మాత: డా.వెంకట్, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు- దర్శకత్వం: పూరి జగన్నాథ్.


Click it and Unblock the Notifications











