twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షూటింగులో కరెంటు షాక్, కెమెరా‌మెన్ అమర్ మృతి

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: తెలుగులో పలు చిత్రాలకు పని చేసిన సినిమాటోగ్రాఫర్ అమర్ అక్టోబర్ 25న కరెంటు షాక్‌తో మృతి చెందారు. ఓ బోజ్‌పురి చిత్రం షూటింగులో భాగంగా ఉత్తర ప్రదేశ్‌లో ఉన్న ఆయన షూటింగు స్పాట్లో విద్యుత్ ఘాతానికి గురయ్యారు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ...అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు దృవీకరించారు.

    నెల్లూరు జిల్లా ముత్తుకూరులో జన్మించిన అమర్.....ఎస్.గోపాల్ రెడ్డి దగ్గర దాదాపు ఇదరవై ఐదు చిత్రాలకు పని చేసారు. మోహన్ బాబు నటించిన శివశంకర్ చిత్రానికి అమర్ కెమెరా మెన్‌గా పని చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో పాటు శ్రీకాంత్ నటించిన 'ప్రేమ సందడి' సినిమాతో పాటు 15 చిత్రాలకు పని చేసారు.

     Cameraman Amar

    అమర్ సినిమాటోగ్రఫీ అందించిన 'బ్యాండ్ బాజా' చిత్రం త్వరలో విడుదల కానుంది. అమర్ మృతి పట్ల పలువురు తెలుగు సినిమా ప్రముఖులు దిగ్ర్బాంటి వ్యక్తం చేయడంతో పాటు ఆయన కుటుంబానికి సంతాపం ప్రకటించారు. తెలుగు సినిమాటోగ్రాఫర్ల సంఘం అమర్ మృతికి నివాళులు అర్పించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

    English summary
    Cameraman Amar is no more. It’s learnt that the cameraman died due to current shock while shooting a Bhojpuri film in Uttar Pradesh. Amar was born in Mathukuru village in Nellore district along with two brothers and a sister. He is survived with his wife and two daughters.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X