ప్రీతీ జింతా వివాదాస్పద లవ్ లైఫ్, ఎంత మందితో?
హైదరాబాద్: బాలీవుడ్ నటి ప్రీతీ జింతా ప్రస్తుతం బాలీవుడ్లో అడపా దడపా చిత్రాల్లో తప్ప కనిపించడం లేదు. దాదాపు ఐదేళ్ల క్రితమే పరిశ్రమకు దూరమైన వ్యాపారాల్లో బిజీ అయిపోయిన ఆమె 2013లో వచ్చిన బాలీవుడ్ మూవీ 'ఇష్క్ ఇన్ పారిస్' చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది. పైగా ఈచిత్రాన్ని సొంత బేనర్లో నిర్మించింది. అయితే ఈచిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది.
ప్రీతి జింతాకు సొంతగా అనే వ్యాపారాలు ఉన్నాయి. ఐపీఎల్ టీం కింగ్స్ పంజాబ్ జట్టు యజమానుల్లో ఆమె కూడా ఒకరు. బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ రేంజి కాక పోయినా....ఎప్పుడూ వార్తల్లో నిలవడం ఆమె ప్రత్యేకత. ఆమె ఎప్పుడూ వార్తల్లో ఉండటానికి కారణం ఆమె వివాదాస్పద లవ్ లైఫే అంటున్నారు బాలీవుడ్ విశ్లేషకులు.
ప్రీతి జింతా ఇప్పటి వరకు చాలా మందితో ప్రేమ వ్యవహారాలు, ఎఫైర్లు నడిపింది. అయితే ఎవరితోనూ ఎక్కువ కాలం సంబంధాన్ని కొనసాగించ లేక పోయింది.
ప్రీతి జింతా వివాదాస్పద లవ్ లైఫ్‌కు సంబంధించిన వివరాలు స్లైడ్ షోలో....

నెస్ వాడియా
నెస్ వాడియా, ప్రీతి జింతా మధ్య ఉన్న సంబంధం అప్పట్లో చర్చనీయాంశం అయింది. ఇద్దరూ కలిసి గతంలో ఐపీఎల్ పంజాబ్ టీంకు ఓనర్లుగా ఉన్నారు. కొంత కాలం తర్వాత విడిపోయారు.

యువరాజ్ సింగ్
ఐపీఎల్ పంజాబ్ టీంలో గతంలో ఆడిన యవరాజ్ సింగ్, ప్రీతి జింతా వార్తల్లోకి ఎక్కారు. వీరు చాలా క్లోజ్‌గా మూవ్ అవుతుండటంతో ఇద్దరి మధ్య ఎఫైర్ ఉందనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. యువరాజ్ కారణంగానే నెస్ వాడియా ప్రీతికి దూరమయ్యాడనే వార్తలు కూడా వినిపించాయి. అయితే యువరాజ్‌తో అమ్మడు ఎక్కువ కాలం కలిసి ఉండ లేక పోయింది.

శేఖర్ కపూర్
బాలీవుడ్ నటుడు శేఖర్ కపూర్ మాజీ భార్య సుచిత్ర కృష్ణ మూర్తి సంచలన ఆరోపణలు చేసింది. తన భర్తతో విడిపోవడానికి కారణం ప్రీతీ జింతాతో ఎఫైర్ కారణమని ఆమె ఆరోపించింది. అయితే ఈ వార్తలను ప్రీతి జింతా కొట్టి పారేసింది.

మార్క్ రాబిన్సన్
చాలా ఏళ్ల క్రితం 2000 సంవత్సరంలో ప్రీతి జింతా మోడల్ మార్క్ రాబిన్సన్‌తో సహజీవనం చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. అయితే కొంత కాలం తర్వాత ఇద్దరూ విడిపోయారు.

లార్స్ జెల్ద్సేన్
ప్రీతి జింతా, లార్స్ జెల్ద్సేన్‌తో 2004లో సన్నిహితంగా మెలిగింది. ఇద్దరి మధ్య ఎఫైర్ ఉందో? లేదో? తెలియదు కానీ ఇద్దరూ సన్నిహితంగా ఉండే ఫోటోలు అప్పట్లో చర్చనీయాంశం అయింది.


Click it and Unblock the Notifications











