పవన్ కల్యాణ్ సూపర్ కాస్ట్యూమ్స్‌ కోసం యూరప్ లో మఖాం..!?

By Sindhu

పవన్ కల్యాణ్, ఇలియానా నటిస్తోన్న తాజా చిత్రంకోసం కాస్ట్యూమ్స్ విషయమై పవన్ కల్యాణ్ యూరప్ వెళ్లారు. పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్‌లో జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఈనెల 29న వారణాశిలో షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత గణేష్ బాబు వెల్లడించారు. శుక్రవారం మీడియాకు విడుదలచేసిన ప్రకటనలో ఆయన ఈ విధంగా పేర్కొన్నారు.

కళాదర్శకుడు నారాయణరెడ్డి ఆధ్వర్యంలో 100మంది శ్రమించి అద్భుతమైన సెట్‌ను వేశారు. కథలోని కీలక సన్నివేశాలను ఇక్కడ చిత్రిస్తారు. ఈనెల 29న 300మంది యూనిట్ సభ్యులతో ప్రారంభమవుతుంది. కాశీలో 20రోజులకు పైగా షూటింగ్ జరుగుతుంది. ఇందులో పవన్ పాత్ర వైవిధ్యంగా ఉంటుంది.

తనే స్వయంగా యూరప్‌లో కాస్ట్యూమ్స్ డిజైన్ చేయించుకున్నారు. దానికోసం ఆయన ప్రస్తుతం యూరప్ టూర్‌లో ఉన్నారు. ఇందులో ఆయన ప్రత్యేక తరహాలో కన్పిస్తారు. మరో ప్రత్యేక ఏమంటే.. ఇందులో త్రివిక్రమ్ శ్రీనివాస్ సంభాషణలు రాయడం. దర్శకుడిగా మారిన తర్వాత ఆయన రచయితగా దూరమయ్యారు. ఈ చిత్రానికి పనిచేయడం విశేషం. జల్సాలో జోడి కట్టిన ఇలియానా ఈ చిత్రంలో నటిస్తోంది. మరో హీరోయిన్‌గా కృతి కర్బంధా నటిస్తోంది. మణిశర్మ కాంబినేషన్‌లో బాణీలు రూపొందుతున్నాయి అని చెప్పారు. ఈ చిత్రానికి కెమేరా: జైనన్ విన్సెంట్, సహనిర్మాత: శివబాబు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X