బాహుబలి: ది బిగినింగ్..... కంటే ముందు జరిగింది తెలుసుకోవాలనుందా?
హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో తరకెక్కిన 'బాహుబలి-ది బిగినింగ్' చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. తెలుగు సినిమా ఖ్యాతిని ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లిన సినిమా ఇది. త్వరలో పార్ట్-2 'బాహుబలి-ది కంక్లూజన్' ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రం ఏప్రిల్ 28న విడుదల కాబోతోంది.
'బాహుబలి-ది బిగినింగ్' కంటే ముందు జరిగిన విషయాలు ఇంకా సినిమా రూపంలోకి రాక పోయినా.... పుస్తక రూపంలోకి రాబోతున్నాయి. ప్రముఖ రచయిత నీలకంఠన్ రచించిన 'ది రైజ్ ఆఫ్ శివగామి' పేరుతో పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకం కవర్‌పేజీని జయపుర్ సాహిత్య వేడుకలో ఆవిష్కరించారు. మార్చి 7 నుంచి ఈ పుస్తకం పాఠకులకు అందుబాటులోకి రానుంది.
'బాహుబలి' చిత్రంలో ప్రధాన పాత్ర అయిన శివగామి ఆధారంగా ఈ పుస్తకాన్ని రచించారు. 'బాహుబలి: ద బిగినింగ్' కంటే ముందు ఏం జరిగింది అనే విషయాలను ఇందులో పొందు పరిచారని దర్శకుడు రాజమౌళి తెలిపారు.
ఈ కార్యక్రమానికి చాలా తక్కువ మంది వస్తారనుకున్నా. కానీ 'ద రైజ్ ఆఫ్ శివగామి' పుస్తక కవర్ పేజీ ఆవిష్కరణ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది' అంటూ దర్శకుడు రాజమౌళి ట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications











