ప్రాణాలకు తెగించి.. అల్లు అర్జున్‌పై దేశాలు దాటిన అభిమానం, నేపాల్ యువకుడు!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ దేశాలు దాటేసింది. తెలుగు హీరో అయిన బన్నీ మలయాళంలో కూడా స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. మలయాళంలో బన్నీకి భారీ స్థాయిలో అభిమానులు ఉన్నారు. నేపాల్ లాంటి దేశాల్లో కూడా బన్నీ అభిమానులు ఉన్నారంటే ఆశ్చర్యం కలగక మానదు. కానీ ఇది నిజం. బన్నీ కోసం ప్రాణాలు సైతం లెక్క చెయాయని అభిమాని నేపాల్ లో ఉన్నాడు. అతడి పేరు మహేష్ బరెల్. బన్నీపై అతడికి ఇంతలా అభిమానం ఎలా కలిగిందో తెలియదు. తాజాగా మహేష్ అల్లు అర్జున్ కోసం పెద్ద సాహసమే చేశాడు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం!

హిమాలయాల్లో ప్రయాణం

హిమాలయాల్లో ప్రయాణం

స్టార్ హీరోల అభిమానులు తమ అభిమానాన్ని చాటుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. హిమయల్లో స్టార్ హీరోల ఫోటోలు పట్టుకుని ఎత్తైన శిఖరాలు అధిరోహించిన అభిమానులు ఉన్నారు. తాజాగా నేపాల్ కు చెందిన మహేష్ బరల్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కోసం చేసిన సాహసం సులువైనది కాదు. హిమాలయాల్లో అత్యంత ప్రమాదకర ప్రాంతానికి మహేష్ బరల్ వెళ్ళాడు.

ప్రపంచంలోనే ఎత్తైన

ప్రపంచంలోనే ఎత్తైన

టిలిచో సరస్సు ప్రపంచంలోనే ఎత్తైన ప్రాంతంలో ఉంది. హిమాలయాపర్వత శ్రేణుల్లో నేపాల్ లో ఉన్న ఈ సరస్సుని చేరుకోవడం అంటే ప్రాణాలతో చెలగడం ఆడడమే. ఈ సరస్సు సముద్ర మట్టానికి 4.919 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ సరస్సుని చేరుకున్న మహేష్ బారెల్.. అల్లు అర్జున్ ఫొటోతో పోజు ఇచ్చాడు. వణికించే చలిని తట్టుకుని అక్కడకు చేరుకున్నాడంటే మహేష్ బరల్ కు బన్నీపై ఉన్న అభిమానాన్ని అర్థం చేసుకోవచ్చు.

తొరాంగ్ లా పాస్ శిఖరాన్ని కూడా

తొరాంగ్ లా పాస్ శిఖరాన్ని కూడా

పనిలో పనిగా సముద్రమట్టానికి 5,416 మీటర్ల ఎత్తులో ఉన్న తొరాంగ్ లా పాస్ అనే శిఖరాన్ని కూడా మహేష్ అధిరోహించాడు. మహేష్ బరల్ టిలిచో సరస్సు, తొరాంగ్ లా పాస్ శిఖరం వద్ద అల్లు అర్జున్ ఫోటోతో ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నేపాల్ లో బన్నీపై ఇంతటి వీరాభిమానం ఏమిటో అంతుచిక్కని విషయమే.

బన్నీ స్పందన కోసం

బన్నీ స్పందన కోసం

తన సాహసయాత్రని పూర్తి చేసిన తరువాత మహేష్ బరల్ సోషల్ మీడియాలో స్పందించాడు. బన్నీ ఫోటో ఉన్న దృశ్యాలని షేర్ చేస్తూ.. మనమిద్దరం ఈ విధంగా ప్రపంచంలోనే ఎత్తైన సరస్సు వద్దకు చేరుకున్నాం. నేను మీకు పెద్ద అభిమానిని. దీనిపై స్పందిస్తారని అనుకుంటున్నా అంటూ మహేష్ బరల్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X