twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిన్న సినామా అయినా..డర్టీ సినిమా అయినా పెద్ద కలెక్షన్స్ రాబడుతోంది...!

    By Sindhu
    |

    రికార్డ్ బ్రేక్ చేసిన మా హీరో, సినిమా చరిత్ర తిరగరాసిన హీరో, రికార్డులు రాసేది మేమే వాటిని బ్రేక్ చేసేది మేమే, యాభై రోజుల రికార్డులు, వారం రికార్డులు, లేటెస్ట్ గా ఫస్ట్ రోజు రికార్డులు ఇలా సినిమా కలెక్ట్ చేసినా చేయకపోయినా రికార్దుల పేరుతో నిర్మాతలు, ఫ్యాన్స్ ఊదరగొట్టేస్తున్నారు ఈ మధ్య. ఈ కల్చర్ తెలుగులోనే కాదు, బాలీవుడ్ లోనూ ఉంది. అయితే అక్కడ ఇలా రికార్డ్ బ్రేక్ చేసాం అని చెప్పుకునే హీరోలందరికీ కళ్ళు బైర్లు కమ్మే రేంజ్ లో కలెక్షన్స్ చూపించింది డర్టీ పిక్చర్ విద్యాబాలన్. నలభై కోట్లుతో సినిమా తీసి యాభై కోట్లు సంపాదించడం గొప్పేమీ కాదు(మన హీరోల రికార్డులు ఇలాంటివే). కాని పదిహేను కోట్లుతో సినిమా తీసి వారంలో యాభై కోట్లు సంపాదించడం గొప్పే. అదీ మేల్ డామినేషన్ ఉన్న సినీ పరిశ్రమలో. విద్యాబాలన్ తాజా సినిమా డర్టీ పిక్చర్ ఈ విధంగానే దూసుకుపోతుంది

    ఈ చిత్రం విడుదలైన తొలి రోజే మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ఈ చిత్రం, తొలి వారం కలెక్షన్లు 50 కోట్లు దాటాయి. విద్యాబాలన్ లాంటి సెకండ్ గ్రేడ్ కథానాయిక నటించిన చిత్రం ఇంత కలెక్ట్ చేయడం నిజంగా ఓ రికార్డే! మూడేళ్ల క్రితం ప్రియాంకా చోప్రా నటించిన 'ఫ్యాషన్' సినిమా తర్వాత మళ్లీ ఈ చిత్రానికి అంతటి రేంజ్ వచ్చిందని బాలీవుడ్ వ్యాపార వర్గాలు అంటున్నాయి. మళ్లీ హీరోయిన్ ఓరిఎంటేడ్ సినిమాల నిర్మాణానికి ఈ విజయం స్ఫూర్తినిస్తోందని బాలీవుడ్ నిర్మాతలు చెబుతున్నారు.

    ఫ్యాషన్ లాంటి సినిమాలు ఎప్పుడో వచ్చినా అవి అవార్డులుకే తప్ప కలెక్షన్లు వసూలు చేయడానికి పనికిరావు అనే ఆలోచనలో ఉండేది బాలీవుడ్. అయితే డర్టీ పిక్చర్ సినిమాతో ఈ సమీకరణాలు మారిపోయాయి. విద్యాబాలన్ తెగించి చేసిన ఎక్స్ పోజింగ్, తనకు మాత్రమే చేతనైన యాక్టింగ్ తో సినిమా సూపర్ హిట్ అయ్యింది. డర్టీ పిక్చర్ సినిమాను రిలీజ్ కు ముందు బూతు సినిమగా భావించిన వాళ్ళు ఉన్నారు గాని, రిలీజ్ తరువాత ఈ అభిప్రాయంలో కొంత మార్పు వచ్చింది. విద్యాబాలన్ పెద్దగా తెలియని రాజస్థాన్, బీహార్ వంటి రాష్ట్రాల్లోనూ డర్టీ పిక్చర్ రికార్డ్ కలెక్షన్లు సాధిస్తుంది. తెలుగులో కూడా మొదటివారంలో కోటి రూపాయలు కలెక్ట్ చేసింది. కేవలం మల్టీప్లేక్స్ లలోనే కాకుండా గ్రామీణ ప్రాంతాలలో కూడా ఈ చిత్రం హిట్ దిశగా పయనిస్తుండడం విశేషం. అందుకే, ఇప్పుడు విద్యాబాలన్ రేటు కూడా అమాంతం పెరిగిపోయింది.!

    English summary
    The movie added another Rs 20 Cr nett after a superb Rs 30 Cr nett weekend. Considering the star cast and budget the movie has become a very big hit just in a week's time.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X