twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘డర్టీ పిక్చర్’ ఇప్పుడు ఫ్రెంచిలో..

    By Bojja Kumar
    |

    సిల్మ్ స్మిత జీవితం ఆధారంగా రూపొందిన 'డర్టీ పిక్చర్' గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదనుకుంటారు. విడుదలకు ముందు అదో వల్గర్ చిత్రంగా, మితిమీరిన శృంగారం మేళవించి తీసిన చిత్రంగా, అసభ్యం చిత్రంగా భావించారంతా. అయితే సినిమా విడుదలయ్యాక ఈచిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దేశ వ్యాప్తంగా భారీ విజయం సాధించి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది.

    విద్యాబాలన్‌కు స్టార్ హీరోయిన్ ఇమేజ్‌ని తెచ్చిపెట్టిన 'డర్టీపిక్చర్' సినిమా జూలై 4న ఫ్రాన్స్‌లో విడుదలవుతోంది. ఫ్రెంచ్ సబ్ టైటిల్స్‌తో ఈ చిత్రాన్ని అక్కడ ప్రదర్శించనున్నారు. ఫ్రాన్స్‌లో 'డర్టీపిక్చర్'ని బాలాజీ మోషన్ పిక్చర్స్ సంస్థ వారు విడుదల చేస్తున్నారు. 2011 ఏడాది చివరలో విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించి విద్యాబాలన్‌కు జాతీయ ఉత్తమనటి అవార్డుని అందించిన విషయం తెలిసిందే.

    దర్శకుడు మిలన్ లూథ్రియా మాట్లాడుతూ 'దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'డర్టీపిక్చర్' ఫ్రాన్స్ ప్రేక్షకులని కూడా ఆకట్టుకుంటుందన్న నమ్మకముంది. జూలై4న ఈ సినిమా ఫ్రాన్స్‌లో విడుదలవుతోంది. ఆ సమయంలో ఫ్రాన్స్‌లో వుండాలనుకున్నాను కానీ నేను దర్శకత్వం వహించనున్న 'వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై-2' ప్రీ ప్రొడక్షన్ వర్క్‌లో పాల్గొనాల్సి వుంది' అన్నారు.

    విద్యాబాలన్ మాట్లాడుతూ 'డర్టీపిక్చర్' అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శింపబడటం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. యూనివర్సల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రపంచ ప్రేక్షకుల్ని స్పృశించే అంశాలున్నాయి' అన్నారు. త్వరలో కొరియాలో కూడా ఈ సినిమాను విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది.

    English summary
    The biggest cult release of 2011,'The Dirty Picture', will now have a major art-house release in France on July 4. Released with French subtitles, it will show on three screens in Paris and one in Orleans. After the initial run, it will travel to smaller towns in France and Paris suburbs, releasing in all major art-house cinemas there.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X