twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విద్యాబాలన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఆ సినిమా సీ గ్రేడ్ సెక్స్ మూవీలా..

    By Nageswara Rao
    |

    సిల్క్ స్మిత జీవిత కధని ఆధారంగా చేసుకోని బాలీవుడ్‌లో విద్యాబాలన్ డర్టీ పిక్చర్ సినిమాని రూపోందిస్తున్న విషయం తెలిసిందే. ఈసినిమాకి సంబంధించినటువంటి కొన్ని లెటేస్ట్ న్యూస్ ప్రకారం ఈసినిమా అచ్చం సీ గ్రేడ్ సెక్స్ మూవీలా ఉంటుందని సమాచారం. ఇదంతా నిజమేనని ఈసినిమాకి సంబందించినటువంటి కొంత మంది టెక్నీషియన్స్ కూడా వెల్లడించడం జరిగింది.

    సిల్క్ స్మిత సినిమాల విషయానికి వస్తే గతంలో సినిమాలలో ఏవైనా ఐటమ్ సాంగ్స్ ఉన్నాయంటే అవి కేవలం సిల్క్ స్మిత మాత్రమే చేయాలనే విధంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఇది మాత్రమే కాకుండా సెక్స్ బాంబ్ అంచే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు సిల్క్ స్మితగా ప్రాచుర్యం పోందారు. ఎవ్వరికి తెలియని విషయం ఏమిటంటే గతంలో సిల్క్ స్కిత రెండు, మూడు సీ గ్రేడ్ సెక్స్ సినిమాలలో కూడా నటించారని వినికిడి.

    అలాంటి సిల్క్ స్కిత క్యారెక్టర్‌ని ఎంచుకున్నటువంటి విద్యాబాలన్ కూడా రెచ్చిపోయి మరీ డర్టీ పిక్చర్ సినిమాలో నటించడం జరిగిందని సమాచారం. కోన్ని సన్నవేశాలలో విద్యాబాలన్ సిగ్గుపడిపోయి మరీ మాంచి హాట్ హాట్ సన్నివేశాల్లో నటించారంట. సెన్సార్ కత్తెర గనుక సరిగ్గా పడకపోతే డర్టీ పిక్చర్ అనే సినిమాలో ఎక్స్ పోజింగ్ చాలా ఎక్కువగా ఉండవచ్చునని వినికిడి.

    ఏక్తాకపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో విద్యాబాలన్ ప్రధాన పాత్రలో సిల్క్ స్మితగా నటిస్తోంది. ఇప్పుడీ చిత్రంలో రజనీకాంత్ కూడా కనిపిస్తాడు! అంటే, రజనీని పోలిన పాత్ర ఉంటుందన్న మాట. దీనిని ప్రముఖ నటుడు నసీరుద్దీన్ షా పోషిస్తాడట. రకరకాల హెయిర్ స్టయిల్స్ తో, రజనీ అప్పట్లో ధరించినటువంటి చమ్కీ మెరుపుల దుస్తుల్లో నసీర్ కనిపిస్తాడు. వీరిద్దరి మధ్యన కొన్ని రొమాంటిక్ సీన్స్ కూడా ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఇందులో నసీరుద్దీన్ షా..విద్యాబాలన్ ని వివాహం చేసుకునే నిర్మాతగా కనిపించనున్నారు.

    English summary
    Producer Ekta Kapoor is now making a biopic titled 'The Dirty Picture', inspired by the actress and has roped in Vidya Balan for the main role. "The 70s era was ruled by men where women were just portrayed as sex objects in the film and people were curious about the soft porn icon Silk Smitha," says Ekta Kapoor.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X