twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    2011 హైయిస్ట్ వ్యూస్ వీడియో క్లిప్

    By Srikanya
    |

    విద్యాబాలన్ నటించిన ది డర్టీ పిక్చర్ ఇప్పుడు మరో రికార్డుని క్రియేట్ చేసింది. 2011 మెబైల్ వీడియోస్ లో హైయిస్ట్ వ్యూస్ పొందిన చిత్రంగా తేలింది. ఈ మేరకు ఇండిపెండెంట్ వియు క్లిప్ అనే ఇండిపెండెంట్ కంపెనీ ప్రకటించింది. తమ సర్వేలో ఈ విషయం వెల్లడైందని ఎక్కువ మంది ది డర్టీ పిక్చర్స్ లో క్లిప్స్ ను డౌన్ లోడ్ చేసుకుని మొబైల్ లో వీక్షించారని అన్నారు. ఆ తర్వాత పూనం పాండే కు ఆ అర్హత దక్కింది అన్నారు. డర్టి పిక్చర్ ఇప్పటివరకూ 13,24,000 పైగా వీడియో డౌన్ లోడ్ చేసుకున్నారని వివరించారు. ఈ మేరకు వారు ఓ ప్రెస్ స్టేట్ మెంట్ విడుదల చేసారు. ఇక షారూఖ్ చిత్రం రావన్ అయితే 8,00,000 వీడియో వ్యూలు వచ్చాయి.

    ఇక దక్షిణాదిన అయితే కొలావరి డి పాటకే ఎక్కువ వ్యూలు వచ్చాయని తెలిపారు. అయితే ధనుష్ వెర్షన్ కు కాకుండా సోనూ నిగమ్ కుమారుడు నవీన్ పాడిన కొలావరి డి పాటకే ఎక్కువగా జనం ఆకర్షింపబడ్డారని చెప్పుకొచ్చారు. ధనుష్ పాడిన పాటకు 2,86,000 వీడియో వ్యూలు రాగా, ధనుష్ పాడిన పాటకు 56,000 వచ్చాయని చెప్పుకొచ్చారు. ఇక భాక్సాఫీస్ వద్ద కూడా ది డర్టీపిక్చర్ చిత్రం మంచి విజయాన్నే సాధించింది. హిందిలోనే కాక దక్షిణాది భాషల్లోనూ డబ్బింగ్ అయి విడుదలైన ఈ చిత్రం మొదటి వారానికే పెట్టిన పెట్టుబడి సంపాదించి ఆ తర్వాత నుంచి లాభాల బాటలో పడింది.

    English summary
    Among the most watched Indian videos on mobile, cinema-related content reigned supreme and out of them "The Dirty Picture" was the most watched, with over 13,24,000 mobile views, said a press statement.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X